అన్నం తింటే నిజంగానే బరువు పెరుగుతారా?

Published by: Geddam Vijaya Madhuri

బరువు పెరగడానికి కేవలం అన్నం మాత్రమే కారణం కాదు. మోతాదు, జీవనశైలి కూడా కారణమే.

అవసరానికి మించి ఎక్కువ అన్నం తింటే అదనపు క్యాలరీలు శరీరంలో ఫ్యాట్‌గా నిల్వ అవుతాయి. సరైన పరిమాణంలో తింటే సమస్య ఉండదు.

వైట్ రైస్ త్వరగా జీర్ణమై మళ్లీ త్వరగా ఆకలి వేయించవచ్చు. దీంతో ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది.

బ్రౌన్ రైస్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన ఫీలింగ్ ఇచ్చి ఎక్కువసేపు ఆకలి రాకుండా సహాయపడుతుంది.

అన్నంతో ఎక్కువ నూనె, ఫ్రైలు, జంక్ ఫుడ్స్ తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఎక్కువ. కూరగాయలు, ప్రోటీన్‌తో కలిపి తింటే మంచిది.

రోజంతా కూర్చునే జీవనశైలి ఉంటే అన్నం వల్ల కాకుండా మొత్తం క్యాలరీల వల్ల బరువు పెరుగుతారు. వ్యాయామం చేస్తే మంచిది.

అన్నం కార్బోహైడ్రేట్స్‌కు మంచి సోర్స్. శరీరానికి అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది.

రాత్రిళ్లు అధికంగా అన్నం తిని వెంటనే పడుకుంటే క్యాలరీలు బర్న్ కాక బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

చల్లారిన అన్నంలో రెసిస్టెంట్ స్టార్చ్ పెరుగుతుంది. ఇది జీర్ణం కొంచెం నెమ్మదిగా జరిగేలా సహాయపడుతుంది.

అన్నం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. సరైన మోతాదులో, సమతుల ఆహారంతో తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.