అన్వేషించండి

Heat Wave Alert : రోజు రోజుకి పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. వేడి వల్ల శరీరానికి, మనసుకు పొంచి ఉన్న ప్రమాదాలు ఇవే

Stay Cool, Stay Safe : తీవ్రమైన వేడి అనేది కేవలం వాతావరణ సమస్య మాత్రమే కాదు. ఇది శరీరం, మనసు రెండింటిపై కూడా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. డీహైడ్రేషన్, వడదెబ్బ వంటి సమస్యలు పెరుగుతాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వాతావరణ మార్పులతో జనవరి నుంచే పెరుగుతున్న ఎండలు తీవ్రంగా ఉన్నాయి.
  • అధిక వేడి శరీరంలోని నీటిని తగ్గించి, అలసట, డీహైడ్రేషన్ కలిగిస్తుంది.
  • మానసికంగా చిరాకు, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు వేడివల్ల పెరుగుతాయి.
  • పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

Hidden Health Dangers of Extreme Heat : గతంలో వేసవి కాలం అంటే మే-జూన్ అన్నట్టే ఉండేది. కానీ వాతావరణం పూర్తిగా మారిపోయింది. జనవరి చివరి నుంచి ఎండలు పెరగడం.. ఫిబ్రవరి, మార్చికి వచ్చే సరికి అవి తీవ్రంగా మారడం జరుగుతుంది. ఏప్రిల్, మే ఎండలు అయితే ఇక చెప్పనవసరం లేదు. ఎండ, వడగాలులు ప్రజలను శారీరకంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇంటి నుంచి బయటకు రాగానే.. శరీరంలోని శక్తి అంతా డ్రైన్ అయిపోతుంది. 

వైద్యుల ప్రకారం.. నిరంతరం పెరుగుతున్న ఈ వేడి శరీరాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అంతేకాకుండా.. అధిక ఉష్ణోగ్రతలు శరీరంలోని నీటిని వేగంగా ఆవిరి చేస్తాయి. దీనివల్ల డీహైడ్రేషన్, నీరసం, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఇది కేవలం అలసట అని భావించి చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఇలా అజాగ్రత్తగా ఉంటే.. తీవ్రమైన అనారోగ్యానికి కారణం కావచ్చు.

వేడివల్ల శరీరంలో జరిగే మార్పులు..

శరీరం అధిక వేడికి గురైనప్పుడు.. తనను తాను చల్లబరచుకోవడానికి మరింత కష్టపడాల్సి వస్తుంది. చెమట పట్టడం వల్ల శరీరంలోని నీరు, అవసరమైన ఖనిజాలు తగ్గిపోతాయి. ఇది రక్త ప్రసరణను కూడా ప్రభావితం చేస్తుంది. వేడి శరీరం నుంచి తేమను తొలగించి.. చర్మాన్ని నిర్జీవంగా, పొడిగా మారుస్తుంది. దీంతో పెదవులు పగలడం, తల బరువుగా అనిపించడం, చేతులు, కాళ్లు మండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు చర్మంపై దద్దుర్లు, చికాకు, వాపు కూడా రావచ్చు. ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల వడదెబ్బ వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఇవి స్పృహ కోల్పోవడానికి కూడా కారణమవుతాయి. 

మానసికంగా కలిగే ఇబ్బందులు.. 

అధిక వేడి మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు. నిరంతరం వేడికి గురికావడం వల్ల చిరాకు, కోపం, అశాంతి, ఒత్తిడి పెరుగుతాయి. నిద్రలేమి, తలనొప్పులు, చిన్న చిన్న విషయాలకే కోపం రావడం జరుగుతుంది. తీవ్రమైన వేడి మెదడు పనితీరును బలహీనపరుస్తుంది. అందుకే వైద్యులు తరచుగా నీరు తాగాలని, తేలికపాటి ఆహారం తీసుకోవాలని, ఎండకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

వాళ్లు మరింత జాగ్రత్తగా ఉండాలి..

ఈ వేడి వాతావరణంలో పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం, గుండె లేదా మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేదా పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. అలిగే పిల్లలు, వృద్ధులు త్వరగా డీహైడ్రేట్ అవుతారు. ఇలాంటి సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా గణనీయమైన సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి వారు ఎక్కువసేపు ఎండలో ఉండకుండా చూసుకోవాలి. నీరు తాగుతూ, హైడ్రేట్ అయ్యేలా చూసుకోవాలి. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

ఇలాంటి వేడి వాతావరణంలో.. ఫ్యాన్ లేదా కూలర్ కింద ఉంటే సరిపోదు. శరీరాన్ని లోపలి నుంచి కూల్​గా ఉండేలా చూసుకోవాలి. నీరు తాగుతూ.. హైడ్రేటింగ్ ఫుడ్స్ తీసుకుంటూ.. కాటన్ దుస్తులు వేసుకుని చల్లగా చూసుకోవాలి. అలాగే బయటకు వెళ్తే తలపై కప్పుకోవడం, గ్లాసెస్ పెట్టుకోవడం, సన్​స్క్రీన్ రాసుకోవడం వంటివి చేయాలి. 

వైద్యసహాయం ఎప్పుడు తీసుకోవాలంటే..

తీవ్రమైన వేడి, మంట, తల తిరగడం, వాంతులు లేదా నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. నిర్లక్ష్యం చేస్తే అది ప్రాణాంతకమవుతుంది. తలనొప్పి తీవ్రం కావడం, శరీరం సహకరించకపోవడం, అలసిపోవడం వంటి లక్షణాలు కూడా విస్మరించకూడదు.

ఎండాకాలంలో తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తల కోసం ఇది క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget