వాతావరణంలో తేమ పెరగడం, ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువవుతాయి. దీంతో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు తరచూ కనిపిస్తాయి.
వర్షాకాలంలో నిల్వ నీటిలో దోమలు వేగంగా పెరుగుతాయి. ఈడిస్ దోమ కాటు వల్ల డెంగ్యూ వస్తుంది. అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు దీని ప్రధాన లక్షణాలు.
దోమల ద్వారా వ్యాపించే మరో ప్రమాదకర వ్యాధి మలేరియా. చలి వణుకుతో కూడిన జ్వరం, చెమటలు, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి.
కలుషితమైన నీరు లేదా ఆహారం తీసుకోవడం వల్ల టైఫాయిడ్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని వల్ల అధిక జ్వరం, కడుపు నొప్పి, అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి.
వర్షాకాలంలో నీటి కలుషితం ఎక్కువగా ఉండటం వల్ల విరేచనాలు, కడుపు ఇన్ఫెక్షన్లు సాధారణంగా కనిపిస్తాయి. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతారు.
ఈ సీజన్‌లో వైరస్‌ల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. జ్వరం, శరీర నొప్పులు, అలసట, తలనొప్పి వంటి లక్షణాలు వైరల్ ఫీవర్‌లో కనిపిస్తాయి.
అధిక తేమ, చెమట కారణంగా చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దురద, ఎర్రటి మచ్చలు, చర్మం పొలుసుల్లా ఊడిపోవడం వంటి లక్షణాలు కనిపించవచ్చు.
వరద నీరు లేదా కలుషిత నీటితో సంబంధం వల్ల ఈ బ్యాక్టీరియా వ్యాధి వచ్చే అవకాశం ఉంది. జ్వరం, కండరాల నొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి.
వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్లు కూడా ఎక్కువవుతాయి. కళ్ల ఎర్రబడటం, నీరు కారడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి.
వాతావరణంలో తేమ పెరగడం, ఫంగస్, దుమ్ము కణాల ప్రభావం వల్ల ఆస్తమా ఉన్నవారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పెరగవచ్చు.