అన్వేషించండి

Summer Infections on the Rise : వేసవిలో ఫుడ్ పాయిజనింగ్ ముప్పు.. టైఫాయిడ్, ఇతర వ్యాధులు పెరగడానికి కారణాలు ఇవే అంటోన్న నిపుణులు

Summer Food Poisoning Alert : వేసవిలో ఫుడ్, తాగే నీరు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవిలో కలుషిత నీరు, ఆహారంతో ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్ కేసులు పెరుగుతాయి.
  • ఇంట్లో శుభ్రత లోపించినా, సరిగా నిల్వ చేయని ఆహారం వల్ల అనారోగ్యం కలుగుతుంది.
  • వాంతులు, విరేచనాలు, జ్వరం వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
  • శుభ్రమైన నీరు, ఆహారం, పరిశుభ్రతతో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

Hot Weather and Hidden Dangers : వేసవి ప్రారంభమైతే ఎండలు మాత్రమే కాదు.. ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల కేసులు కూడా పెరుగుతుంటాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌లు, పరాన్నజీవులు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ సరిగ్గా స్టోర్ చేయకపోతే.. కలుషితమైన నీరు ఆరోగ్యానికి పెద్ద ప్రమాదంగా మారుతాయి.

చాలామంది ఏమనుకుంటారంటే.. బయట తినడం వల్ల మాత్రమే ఇలాంటి ఇన్ఫెక్షన్లు వస్తాయని అనుకుంటారు. కానీ ఇంట్లో ఉపయోగించే కలుషిత నీరు, సరిగా కడగని పండ్లు, కూరగాయలు, పదేపదే ఉపయోగించే వంటనూనె, అపరిశుభ్రమైన వంట విధానాలు కూడా ఆరోగ్య సమస్యలకు కారణమని యశోద హాస్పిటల్స్​లో సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రోలజిస్ట్, హెపటాలజిస్ట్​గా చేస్తోన్న డాక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. వేసవిలో వేడి ఎక్కువగా ఉండటం వల్ల ఆహారంలో బ్యాక్టీరియా వేగంగా పెరిగి విరేచనాలు, జాండిస్, హెపటైటిస్-ఏ, టైఫాయిడ్ వంటి సమస్యలకు దారి తీస్తుందని అంటున్నారు.

ఫుడ్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండాకాలంలో కొన్ని గంటల పాటు బయట ఉంచిన ఆహారం పాడయ్యే అవకాశం ఎక్కువ. చూడటానికి తాజాగా కనిపించినా, వాసన సాధారణంగానే ఉన్నా అందులో సూక్ష్మక్రిములు పెరిగి ఉండొచ్చు. ముఖ్యంగా కట్ చేసిన పండ్లు, చట్నీలు, సలాడ్లు, ఐస్ ఆధారిత డ్రింక్స్, పాల పదార్థాలు వేడిలో చాలా త్వరగా పాడవుతాయి. నీటికొరత ఉన్న ప్రాంతాల్లో చాలామంది శుభ్రం కాని నీటిని తాగడం కూడా మరో పెద్ద సమస్య. కలుషిత నీటితో చేసిన జ్యూస్‌లు, ఐస్ క్యూబ్స్, వండని ఆహారం వల్ల ఇన్ఫెక్షన్ల ప్రమాదం మరింత పెరుగుతుంది.

ఫుడ్ పాయిజనింగ్‌ 

ఫుడ్ పాయిజనింగ్ చిన్న సమస్య కాదని వాటిని లైట్ తీసుకోవద్దని డాక్టర్ చంద్ర శేఖర్ రెడ్డి తెలిపారు. నిరంతర వాంతులు, విరేచనాలు, జ్వరం, కడుపు నొప్పి, బలహీనత, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త అవసరం. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, డయాబెటిస్ లేదా తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారిలో డీహైడ్రేషన్ త్వరగా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పరిస్థితి తీవ్రమైతే ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. 

తప్పక తీసుకోవాల్సిన టిప్స్

శుభ్రమైన నీరు తాగడం వల్ల చాలా వరకు నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు. రోడ్డు పక్కన మూతలేకుండా అమ్మే ఆహారం, కట్ చేసిన పండ్లు, ఐస్ డ్రింక్స్‌కు దూరంగా ఉండటం మంచిది. వండిన ఆహారాన్ని ఎక్కువసేపు రూమ్ టెంపరేచర్లో ఉంచకండి. వీలైనంత త్వరగా తినడం మంచిది. తినే ముందు, వంట చేసే ముందు సబ్బుతో చేతులు కడుక్కోవడం చాలా ముఖ్యం. 

ఈ లక్షణాలు కనిపిస్తే..

పాలు, పెరుగు, కూరలు వంటి పదార్థాలను ఫ్రిడ్జ్​లో ఉంచుకోవాలి. ఆహారాన్ని ఒకసారి కంటే ఎక్కువసార్లు వేడి చేస్తే.. ఆరోగ్యానికి మంచిది కాదు. ఒక రోజుకి మించి వాంతులు, విరేచనాలు కొనసాగితే.. అధిక జ్వరం, మలంలో రక్తం, తీవ్రమైన డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం అవసరం.

వేసవిలో వచ్చే ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్, నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు చాలా వరకు కొన్ని జాగ్రత్తలతో నివారించవచ్చు. శుభ్రమైన ఆహారం, పరిశుభ్రమైన నీరు, సరైన హైజీన్ అలవాట్లు పాటిస్తే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. కాబట్టి వేసవిలో ఆహారం, నీటి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Habits To Quit Before 40 : 40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
40 ఏళ్లు వచ్చేలోపు మానేయాల్సిన 7 అలవాట్లు.. లేదంటే ఆరోగ్యంపై ఈ ప్రభావాలు తప్పవు
Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Korean Beauty Secrets : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే
White Sneakers Cleaning Tips : తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
తెల్లటి షూస్ మురికిగా మారాయా? ఇంట్లోనే శుభ్రం చేసేందుకు 9 ఈజీ చిట్కాలు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget