అన్వేషించండి

Watermelon Storage Tips : కోసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఇలా నిల్వ చేయండి.. లేకపోతే ప్రమాదమే, ఫుడ్ పాయిజనింగ్ కావచ్చు

Watermelon : ఫ్రిజ్‌లో ఉంచిన లేదా మార్కెట్ నుంచి తెచ్చిన కోసిన పుచ్చకాయ ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించవచ్చు. మరి కోసిన పుచ్చకాయను ఎలా నిల్వ చేసుకోవాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కోసిన పుచ్చకాయను సరిగా నిల్వ చేయకపోతే ఫుడ్ పాయిజనింగ్ వస్తుంది.
  • తొక్కపై బ్యాక్టీరియా కత్తి ద్వారా పుచ్చకాయలోకి చేరుతుంది.
  • నిల్వ ఉంచిన ముక్కలు సాల్మొనెల్లా, లిస్టేరియా బ్యాక్టీరియా కలిగిస్తాయి.
  • పుచ్చకాయను కడిగిన తర్వాతే కోయాలి, గాలి చొరబడకుండా నిల్వచేయాలి.

Tips to Storing Cut Watermelon : వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం, శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి పుచ్చకాయను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అలాగే చాలామంది సమయం ఆదా చేసుకోవడానికి మార్కెట్ నుంచి ముందుగా కోసిన పుచ్చకాయ ముక్కలు తెచ్చుకుంటారు. లేదా ఇంట్లోనే పెద్ద పుచ్చకాయను కోసి.. రోజంతా తినడానికి ఫ్రిజ్‌లో రెడీగా పెట్టుకుంటారు. కానీ ఈ విధంగా నిల్వ చేసిన పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలుసా? కోసిన పుచ్చకాయను సరిగ్గా నిల్వ చేయకపోతే.. అది ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు, డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు. 

పుచ్చకాయను కోసేస్తే..

పుచ్చకాయపై ఉండే తొక్క దానిని బయటి వాతావరణం, క్రిముల నుంచి కాపాడుతుంది. కానీ కత్తితో కోసిన వెంటనే.. దాని మెత్తటి, ఎర్రటి, తియ్యటి భాగం.. బయటి గాలికి, మన చేతులకు లేదా కత్తిపై ఉండే కంటికి కనిపించని బ్యాక్టీరియాకు ఎఫెక్ట్ చేస్తుంది. పుచ్చకాయలో నీరు, సహజ చక్కెర అధికంగా ఉంటాయి. ఈ తేమ, తీపి.. బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పిస్తాయి. కోసిన పుచ్చకాయను వెంటనే సరైన ఉష్ణోగ్రత ఉన్న ఫ్రిజ్‌లో పెట్టకుండా.. బయట ఎండలో వదిలేస్తే.. అతి తక్కువ సమయంలో దానిపై హానికరమైన క్రిములు వృద్ధి చెందుతాయి.

ఫుడ్ పాయిజనింగ్ 

ఇలా నిల్వ ఉంచిన పుచ్చకాయ ముక్కలను తినడం వల్ల సాల్మొనెల్లా, లిస్టేరియా వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ బ్యాక్టీరియా కడుపులోకి ప్రవేశించిన వెంటనే జీర్ణవ్యవస్థను దెబ్బతీసి.. భరించలేని కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, అధిక జ్వరం, డీహైడ్రేషన్ వంటి తీవ్రమైన శారీరక సమస్యలను కలిగిస్తాయి. తరచుగా మార్కెట్లలో రోడ్డు పక్కన అమ్మే మూతలేని పుచ్చకాయలపై దుమ్ము, ధూళి, ఈగలు చేరి.. ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని రెట్టింపు అవుతాయి.

అతి పెద్ద పొరపాటు ఇదే..

పుచ్చకాయ తినేటప్పుడు చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే.. దానిని కోయడానికి ముందు దానిపై తొక్కను కడగరు. పుచ్చకాయ నేల మీద పెరుగుతుంది కాబట్టి.. దాని తొక్కపై చాలా దుమ్ము, మట్టి, రసాయన ఎరువుల అవశేషాలు అలాగే బ్యాక్టీరియా ఉంటాయి. కడగకుండా నేరుగా కోసినప్పుడు.. తొక్కపై ఉన్న బ్యాక్టీరియా కత్తి ద్వారా పుచ్చకాయలోకి ప్రవేశిస్తుంది. అందువల్ల పుచ్చకాయను కోయడానికి ముందు శుభ్రమైన కుళాయి నీటితో పూర్తిగా కడగడం చాలా అవసరం.

పుచ్చకాయ స్టోరేజ్ టిప్స్

మీరు పుచ్చకాయను కోసి కొంతకాలం పాటు నిల్వ చేయాలనుకుంటే.. పోషకాహార నిపుణులు సూచించిన ప్రత్యేక నిల్వ నియమాలను పాటించాలి. కోసిన పుచ్చకాయ ముక్కలను ఎప్పుడూ ప్లేట్‌లో తెరిచి ఉంచకూడదు. వాటిని ఎప్పుడూ గాలి చేరని మంచి డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఒకవేళ డబ్బా అందుబాటులో లేకపోతే.. ఫ్రిజ్‌లోని ఇతర ఆహార పదార్థాల నుంచి బ్యాక్టీరియా కలవకుండా ఉండేందుకు.. దానిని ర్యాప్‌తో గట్టిగా మూసివేయాలి. దీనితో పాటు.. ఫ్రిజ్ ఉష్ణోగ్రత ఎల్లప్పుడూ 4 డిగ్రీల ఉష్ణోగ్రత లేదా అంతకంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. కోసిన పుచ్చకాయను1 లేదా 2 రోజుల్లోపు తినేయాలి.

మండే ఎండలు, గాలిలోని తేమ కారణంగా ఈ రోజుల్లో ఏ ఆహారమైనా చాలా త్వరగా పాడైపోతుంది. ఇలాంటి వాతావరణంలో బ్యాక్టీరియా రెట్టింపు వేగంతో వృద్ధి చెందుతుంది. దీనివల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు బాగా పెరుగుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు, వృద్ధులకు, గర్భిణీ స్త్రీలకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి.. నిల్వ ఉన్న లేదా కలుషితమైన ఆహారం మరింత ప్రమాదకరంగా మారవచ్చు. అందుకే ఆహార శుభ్రత విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదు. తెరిచి ఉంచిన లేదా ఎక్కువ కాలం నిల్వ ఉంచిన పండ్లను తినడం మానుకోవాలి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Chalasani Anjaneyulu: విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
విజయ డెయిరీ చైర్మన్, బోర్డు డైరెక్టర్ పదవులకు చలసాని ఆంజనేయులు రాజీనామా
Medical Student Brain Dead: రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో విషాదం.. మెడికల్ విద్యార్థినికి బ్రెయిన్ డెడ్
PMFBY Last Date: రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
రైతులకు అలర్ట్.. పంటల బీమా నమోదు గడువు పెంపు.. ఇలా అప్లై చేసుకోండి!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
Vishwanath And Sons Trailer: సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ ట్రైలర్ వచ్చేసిందోచ్... హిట్టు కళ కనబడుతోందిగా
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Care Health Insurance: తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
తెలంగాణలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా, ప్రజలకు ఇబ్బందులే... షాక్ ఇచ్చిన టీఎస్‌హెచ్‌ఏ!
Embed widget