కాలేయ ఆరోగ్యం కోసం ఈ పండ్లు తినేయండి

Published by: Geddam Vijaya Madhuri

ఆపిల్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో లివర్‌లోని టాక్సిన్స్ బయటకు వెళ్లేందుకు సహాయపడతాయి.

ద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు లివర్‌ను డ్యామేజ్ నుంచి రక్షించడంలో హెల్ప్ చేస్తాయి.

బొప్పాయిలో జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైమ్స్ ఉండటంతో లివర్‌పై ఒత్తిడి తగ్గవచ్చు.

నిమ్మకాయలో ఉండే విటమిన్ C శరీర డిటాక్స్ ప్రక్రియకు సహాయపడుతుంది.

అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్ ఉండటంతో లివర్ పనితీరు మెరుగుపడేందుకు ఉపయోగపడొచ్చు.

బెర్రీ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు లివర్ కణాలను రక్షించడంలో సహాయపడతాయి.

పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి లివర్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

దానిమ్మలో ఉండే పోషకాలు శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

అరటిపండులో ఉండే పొటాషియం, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి లివర్‌కు సహాయపడతాయి.

పండ్లు మాత్రమే కాకుండా.. తక్కువ ఆయిల్, తక్కువ షుగర్ ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా లివర్ ఆరోగ్యానికి చాలా ముఖ్యం.