ప్రతిరోజూ 5 నిమిషాలు ఈ పొజిషన్‌లో కూర్చుంటే కలిగే లాభాలివే

Published by: Geddam Vijaya Madhuri

ప్రతిరోజూ కొద్దిసేపు స్క్వాట్ పొజిషన్‌లో ఉండటం వల్ల కాళ్ల కండరాలు బలపడతాయి.

ఈ పొజిషన్ హిప్స్, మోకాళ్ల ఫ్లెక్సిబిలిటీని మెరుగుపరుస్తాయి.

ఎక్కువసేపు కుర్చీలో కూర్చునే వారికి ఇది మంచి స్ట్రెచింగ్ వ్యాయామంలా పనిచేస్తుంది.

స్క్వాట్ పొజిషన్ జీర్ణక్రియకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

పెల్విక్ ప్రాంతంలో రక్తప్రసరణ మెరుగుపడేందుకు ఇది హెల్ప్ చేస్తుంది.

శరీర సమతుల్యత, స్టామినా పెరగడంలో కూడా ఈ వ్యాయామం ఉపయోగపడుతుంది.

రోజూ స్క్వాట్ పొజిషన్ ప్రాక్టీస్ చేయడం వల్ల శరీర భంగిమ మెరుగుపడుతుంది.

నడుము బిగుతు, కాళ్ల పట్టేయడం వంటి సమస్యలు తగ్గడంలో సహాయపడుతుంది.

మోకాళ్ల నొప్పులు లేదా జాయింట్ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

మొదట్లో 1-2 నిమిషాలతో ప్రారంభించి.. క్రమంగా 5 నిమిషాలకు పెంచితే మంచి ఫలితాలు ఉంటాయి.