బెండకాయ నీరు తాగితే బ్లడ్ షుగర్‌ కంట్రోల్ అవుతుందా?

Published by: Geddam Vijaya Madhuri

బెండకాయ నీరు ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. అయితే ఇది డయాబెటిస్ కంట్రోల్ చేస్తుందా?

బెండకాయలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మది చేయడంలో సహాయపడుతుంది.

బెండకాయ నీరు తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ ఒక్కసారిగా పెరగకుండా ఉండొచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

బెండకాయలో తక్కువ క్యాలరీలు ఉండటంతో బరువు కంట్రోల్ చేసేందుకు హెల్ప్ చేస్తాయి.

డయాబెటిస్ ఉన్నవారిలో జీర్ణక్రియ మెరుగుపడేందుకు బెండకాయలోని మ్యూసిలేజ్ అనే పదార్థం హెల్ప్ చేస్తుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో బెండకాయ నీరు తాగితే కొందరికి శరీరం తేలికగా అనిపించొచ్చు.

ఇది ఇన్సులిన్ స్పందనను మెరుగుపరచడంలో కొంతవరకు ఉపయోగపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బెండకాయ నీరు మాత్రమే డయాబెటిస్‌ను పూర్తిగా కంట్రోల్ చేయదు.. సరైన ఆహారం, వ్యాయామం కూడా అవసరం.

షుగర్ మందులు వాడేవారు రెగ్యులర్‌గా బెండకాయ నీరు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

బెండకాయ నీటిని ఇంట్లో తయారు చేసుకోవాలంటే.. బెండకాయలను ముక్కలుగా కట్ చేసి రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగాలి.