బరువు తగ్గాలంటే డ్రై ఫ్రూట్స్, నట్స్ ఎప్పుడు తింటే మంచిదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri

ఉదయాన్నే బాదం, ఆక్రోట్ వంటి నట్స్ తింటే ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉండి ఓవర్ ఈటింగ్ తగ్గుతుంది.

ఓట్స్, స్మూతీస్ లేదా ఫ్రూట్ బౌల్‌లో నట్స్ కలిపితే ప్రోటీన్, ఫైబర్ పెరిగి బరువు నియంత్రణకు సహాయపడుతుంది.

ఈవెనింగ్ జంక్ ఫుడ్ తినాలనిపించినప్పుడు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే హెల్దీగా ఫీల్ అవుతారు.

కొద్దిగా ఖర్జూరం, కిస్మిస్ తింటే వ్యాయామ సమయంలో శక్తి అందుతుంది.

వ్యాయామం చేసిన తర్వాత తింటే ప్రోటీన్, మంచి కొవ్వులు శరీరానికి అంది త్వరగా రికవరీ అవుతాయి.

డ్రై ఫ్రూట్స్‌లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి ఎక్కువగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

రోజుకు ఒక చిన్న గుప్పెడు మాత్రమే తినాలి. ఎక్కువైతే క్యాలరీలు పెరిగిపోతాయి.

ఉప్పు, షుగర్ ఉన్న నట్స్ తగ్గించాలి. ఇవి బరువు తగ్గడంలో ఆటంకం కలిగించవచ్చు.

రాత్రంతా నానబెట్టిన బాదం ఉదయం తింటే జీర్ణం బాగా అవుతుంది.

డ్రై ఫ్రూట్స్ మాత్రమే కాకుండా.. సరైన ఆహారం, వ్యాయామం చేస్తే బరువు తగ్గుతారు.