థైరాయిడ్ ఉన్నవారు తినకూడని ఫుడ్స్‌ లిస్ట్

Published by: Geddam Vijaya Madhuri

సోయా పాలు, టోఫూ, సోయా చంక్స్ వంటి వాటిని అధికంగా తీసుకుంటే థైరాయిడ్ హార్మోన్ శోషణపై ప్రభావం పడొచ్చు.

క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకోలీ వంటి తింటే అయోడిన్ వినియోగంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అయితే వీటిని లిమిటెడ్గా తీసుకోవచ్చు.

బర్గర్లు, పిజ్జాలు, ఫ్రైడ్ ఫుడ్స్‌లో ట్రాన్స్ ఫ్యాట్స్, అధిక ఉప్పు ఉంటాయి. ఇవి బరువు పెంచడమే కాకుండా థైరాయిడ్ సమస్యలను మరింత పెంచుతాయి.

స్వీట్స్, కూల్‌డ్రింక్స్, కేకులు వంటి వాటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ కారణంగా మెటాబాలిజం స్లో అవుతుంది.

ప్యాకెట్ స్నాక్స్, ప్రాసెస్డ్ మీట్, రెడీమేడ్ ఫుడ్స్‌లో సోడియం అధికంగా ఉంటుంది. ఇవి హార్మోన్ బ్యాలెన్స్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.

అధికంగా కాఫీ తాగితే థైరాయిడ్ మందుల ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మందులు తీసుకున్న వెంటనే కాఫీ తాగకూడదు.

ఆల్కహాల్ థైరాయిడ్ గ్రంథి పనితీరును ప్రభావితం చేయవచ్చు. హార్మోన్ ఉత్పత్తి తగ్గే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.

చిప్స్, పాప్కార్న్, ప్యాకెట్ ఫుడ్స్‌లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది బీపీతో పాటు థైరాయిడ్ సమస్యలను కూడా పెంచవచ్చు.

కొంతమందిలో గ్లూటెన్ ఉన్న ఆహారం థైరాయిడ్ ఆటోఇమ్యూన్ సమస్యలను ట్రిగ్గర్ చేయవచ్చు.

డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెంచుతాయి. ఇవి హార్మోన్ బ్యాలెన్స్‌ను దెబ్బతీసే అవకాశం ఉంటుంది.

థైరాయిడ్ ఉన్నవారు సరైన డైట్, వ్యాయామం, సమయానికి మందులు తీసుకోవడం ద్వారా సమస్యను కంట్రోల్‌లోచేసుకోవచ్చు.