టీబీని కంట్రోల్ చేసే ఫుడ్స్ ఇవే.. ఇమ్యూనిటీ కోసం తినండి

Published by: Geddam Vijaya Madhuri

గుడ్లలో ప్రోటీన్, విటమిన్ D, B12 పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల బలాన్ని పెంచి టీబీ వల్ల వచ్చే బలహీనతను తగ్గిస్తాయి.

పాలు, పెరుగులో కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని స్ట్రాంగ్‌గా ఉంచడంలో సహాయపడతాయి.

మినుములు, కందిపప్పు, శనగలు వంటి వాటిలో మంచి ప్రోటీన్ ఉంటుంది. టీబీ పేషెంట్లకు బాడీ రికవరీ కోసం ఇవి చాలా అవసరం.

పాలకూర, గోంగూర, బచ్చలి వంటి ఆకుకూరల్లో ఐరన్, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గిస్తాయి.

నారింజ, బత్తాయి, నిమ్మకాయల్లో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.

బాదం, వాల్‌నట్స్, జీడిపప్పలో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్, విటమిన్లు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.

వెల్లుల్లిలో యాంటీబాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇది శరీరంలోని ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుందని చెబుతారు.

చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించి బలం పెంచుతాయి.

అరటిపండ్లు తేలికగా జీర్ణమవుతాయి. శరీరానికి వెంటనే ఎనర్జీ ఇస్తాయి. ఆకలి తగ్గిన టీబీ పేషెంట్లకు ఇవి మంచి ఆప్షన్.

టీబీ సమయంలో శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా నీరు, సూప్స్, కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిది.

టీబీకి డాక్టర్ సూచించిన మందులు తప్పనిసరిగా తీసుకోవాలి. కేవలం ఆహారం మాత్రమే చికిత్స కాదు.