మలబద్ధకాన్ని తగ్గించే ఫుడ్స్ ఇవే.. వేసవిలో ఇబ్బందిని దూరం చేసుకోండిలా

Published by: Geddam Vijaya Madhuri

బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం సమస్య తగ్గించడంలో సహాయపడుతుంది.

పండిన అరటిపండ్లలో ఉండే ఫైబర్ పేగుల పనితీరును మెరుగుపరుస్తుంది. దీంతో మలం సాఫ్ట్‌గా మారి బయటకు రావడం సులభమవుతుంది.

ఓట్స్‌లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచి మలబద్ధకం తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

చియా సీడ్స్ నీటిని ఎక్కువగా పీల్చుకుని జెల్‌లా మారతాయి. దీంతో మలం మెత్తబడటానికి సహాయపడుతుంది.

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరచి మలబద్ధకం సమస్య తగ్గిస్తుంది.

పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఫైబర్, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి పేగుల కదలికలను మెరుగుపరుస్తాయి.

యాపిల్స్‌లో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల పేగులు యాక్టివ్ అవుతాయి. దీంతో మల విసర్జన సులభంగా జరుగుతుంది.

అవిసె గింజల్లో ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచి మలబద్ధకం తగ్గించడంలో సహాయపడతాయి.

ఎండు ద్రాక్షలు రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మలబద్ధకం సమస్య తగ్గవచ్చు.