అల్లం పచ్చిగా తినొచ్చా? తింటే కలిగే లాభాలు

Published by: Geddam Vijaya Madhuri

జీర్ణ వ్యవస్థను యాక్టివ్‌గా ఉంచి ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అజీర్ణం, గ్యాస్, పొట్ట ఉబ్బరం తగ్గిస్తుంది.

అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు రాకుండా చేస్తాయి.

జర్నీ టైమ్లో వచ్చే వికారం, ఉదయం వాంతుల ఫీలింగ్, గర్భిణీలకు వచ్చే వాంతులు తగ్గించడంలో అల్లం సహాయపడుతుంది.

అల్లం శరీరంలోని వాపు, ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవారికి కొంత ఉపశమనం ఇవ్వవచ్చు.

పచ్చి అల్లం మెటబాలిజాన్ని పెంచి కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఆకలి కంట్రోల్ చేస్తుంది.

కొన్ని పరిశోధనల ప్రకారం అల్లం రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను బ్యాలెన్స్ చేయడంలో సహాయపడవచ్చు.

రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడవచ్చు.

పచ్చి అల్లం గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యల్లో ఉపశమనం ఇవ్వడంలో సహాయపడుతుంది. శరీరాన్ని వేడిగా ఉంచుతుంది.

అల్లంలోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు కణాలను రక్షించడంలో సహాయపడతాయి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత మెరుగవుతుంది.

అల్లం శరీర డిటాక్స్ ప్రక్రియకు సహకరిస్తుంది. చెమట ద్వారా మలినాలను బయటకు పంపిస్తుంది.

పచ్చి అల్లం ఎక్కువగా తీసుకుంటే గ్యాస్, మంట, కడుపు అసౌకర్యం రావచ్చు. రోజుకు చిన్న మోతాదులో తీసుకోవడం మంచిది.