యూరిక్ యాసిడ్‌ను సహజంగా తగ్గించే ఫుడ్స్

Published by: Geddam Vijaya Madhuri

యూరిక్ యాసిడ్ తగ్గడం వల్ల ఆరోగ్యానికి ఇబ్బందులు వస్తాయి. అందుకే దానిని తగ్గించుకునేందుకు కొన్ని ఫుడ్స్ తీసుకోవాలంటున్నారు.

చెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

నిమ్మరసంలో విటమిన్ C అధికంగా ఉంటుంది. ఇది యూరిక్ యాసిడ్‌ను శరీరం నుంచి బయటకు పంపడంలో సహాయపడుతుంది.

కీరదోసలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి యూరిక్ యాసిడ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది.

లో ఫ్యాట్ పెరుగు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉంటుంది. ఇది జీర్ణక్రియకు కూడా మేలు చేస్తుంది.

ఆపిల్‌ యూరిక్ యాసిడ్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది టాక్సిన్స్ తగ్గించి యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది.

అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వ కాకుండా సహాయపడుతుంది.

ఓట్స్‌లోని ఫైబర్ వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. దీంతో యూరిక్ యాసిడ్ స్థాయిలు కంట్రోల్ అవుతాయి.

పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచి యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపిస్తుంది.

పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ నియంత్రణకు సహాయపడతాయి.