కిడ్నీలో రాళ్లను సూచించే లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేయొద్దు

Published by: Geddam Vijaya Madhuri

కిడ్నీ స్టోన్స్ ఉన్నప్పుడు వెన్ను పక్కభాగంలో లేదా నడుము దగ్గర తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి కింద భాగాలకు కూడా వ్యాపించవచ్చు.

యూరిన్ చేస్తుంటే మంటగా లేదా నొప్పిగా అనిపించడం కిడ్నీ స్టోన్ లక్షణం కావచ్చు. ముఖ్యంగా రాయి మూత్రనాళంలోకి వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది.

సాధారణం కంటే ఎక్కువసార్లు యూరిన్‌కు వెళ్లాల్సి రావడం కూడా ఒక సంకేతం. రాత్రిపూట కూడా పదే పదే బాత్రూమ్‌కు వెళ్లాల్సి రావచ్చు.

యూరిన్ రంగు గులాబీ, ఎరుపు లేదా గోధుమరంగులో కనిపిస్తే జాగ్రత్త. ఇది కిడ్నీ స్టోన్ వల్ల కావచ్చు.

యూరిన్‌కు అసహజమైన వాసన రావడం లేదా మసకగా కనిపించడం ఇన్ఫెక్షన్ లేదా స్టోన్స్ సంకేతం కావచ్చు.

కిడ్నీ స్టోన్ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు వాంతులు, వికారం రావచ్చు. శరీరం బలహీనంగా అనిపించవచ్చు.

స్టోన్‌తో పాటు ఇన్ఫెక్షన్ ఉంటే జ్వరం, చలి వణుకులు రావచ్చు. ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉండటంతో వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

యూరిన్ పూర్తిగా అవ్వలేదనే ఫీలింగ్ రావచ్చు. కొన్నిసార్లు మూత్ర ప్రవాహం కూడా తగ్గిపోతుంది.

కడుపు కింది భాగంలో భారంగా లేదా ఒత్తిడిగా అనిపించడం కూడా కిడ్నీ స్టోన్స్ సంకేతంగా ఉండొచ్చు.

కిడ్నీ స్టోన్ నొప్పి అలల మాదిరిగా వస్తూ పోతూ ఉంటుంది. కొన్ని క్షణాల్లోనే తీవ్రమై సాధారణ పనులు కూడా చేయలేని స్థితి రావచ్చు.

ఈ లక్షణాలు కనిపిస్తే స్వయంగా మందులు వాడకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.