మగవారు తప్పక తినాల్సిన ఫుడ్స్.. గుండె ఆరోగ్యానికై

Published by: Geddam Vijaya Madhuri

ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటే మంచిది.

వాల్‌నట్స్, బాదంలో ఉండే కొవ్వులు గుండెకు రక్షణగా పనిచేస్తాయి. రోజూ కొద్దిగా తింటే హార్ట్ రిస్క్ తగ్గుతుంది.

సాల్మన్, సార్డిన్ వంటి చేపల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బీపీ, ట్రైగ్లిసరైడ్స్‌ను కంట్రోల్ చేస్తాయి.

పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.

టమోటాలో ఉండే లైకోపీన్ గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రెగ్యులర్‌గా తింటే హార్ట్ డిసీజ్ ప్రమాదం తగ్గుతుంది.

స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ వంటి పండ్లు గుండెకు హానికరమైన ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

వెల్లుల్లి రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇది సహజమైన ఆహారంగా భావిస్తారు.

ఆలివ్ ఆయిల్ వాడితే మంచి కొవ్వులు శరీరానికి అందుతాయి. ఇది హార్ట్‌కి ఫ్రెండ్లీ ఆయిల్‌గా నిపుణులు చెప్తారు.

పప్పులు, శనగల్లో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

మితంగా తీసుకుంటే డార్క్ చాక్లెట్ రక్తప్రసరణను మెరుగుపరచి గుండె పనితీరుకు సహాయపడుతుంది.