30 రోజుల్లో యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే చిట్కాలు

Published by: Geddam Vijaya Madhuri

యూరిక్ యాసిడ్ కీళ్ల నొప్పుల సమస్యలను రెట్టింపు చేస్తుంది. దానిని బ్యాలెన్స్గా ఉంచుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.

రోజుకు సరిపడా నీళ్లు తాగితే శరీరంలో ఉన్న యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతుంది.

రెడ్ మీట్, లివర్ మీట్, కొన్ని సీ ఫుడ్లలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తగ్గించడం మంచిది.

సాఫ్ట్ డ్రింక్స్, అధిక షుగర్ ఉన్న జ్యూసులు యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణమవుతాయి.

అధిక బరువు ఉన్నవారిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. క్రమంగా బరువు తగ్గడం మంచిది.

ఆల్కహాల్, బీర్ వంటి మద్యం యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచవచ్చు.

విటమిన్ C ఉన్న నిమ్మ, కమల, ఉసిరి వంటి ఫుడ్స్ యూరిక్ యాసిడ్ తగ్గిస్తాయి.

నడక, యోగా, తేలికపాటి వ్యాయామం శరీర మెటాబాలిజాన్ని మెరుగుపరుస్తుంది.

ప్యాకెట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెంచి సమస్యను అధికం చేయవచ్చు.

ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు యూరిక్ యాసిడ్ ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.

తగినంత నిద్ర లేకపోతే శరీరంలో ఇన్‌ఫ్లమేషన్ పెరిగి యూరిక్ యాసిడ్ సమస్య తీవ్రం కావచ్చు.