2 రోజులు ఓట్స్ తింటే కొలెస్ట్రాల్ తగ్గొచ్చట.. తాజా అధ్యయనంలో వెల్లడి

Published by: Geddam Vijaya Madhuri

ఓట్స్‌లో ఉండే బీటా గ్లూకాన్ అనే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించడంలో సహాయపడుతుంది.

కొత్త అధ్యయనం ప్రకారం.. కేవలం రెండు రోజుల పాటు ఓట్స్ తీసుకున్నా గుండె ఆరోగ్యంపై మంచి ప్రభావం కనిపించొచ్చని చెబుతున్నారు.

ఓట్స్ జీర్ణక్రియను నెమ్మదిగా చేసి.. కొవ్వు శోషణను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకోవడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది.

ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో బరువు నియంత్రణకు కూడా ఉపయోగపడుతుంది.

గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో ఓట్స్ సహాయపడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఓట్స్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా ఉండొచ్చు.

పాలు, పండ్లు, నట్స్‌తో కలిపి ఓట్స్ తీసుకుంటే మరింత పోషక విలువలు అందుతాయి.

రోజూ జంక్ ఫుడ్ తింటూనే ఓట్స్ తీసుకుంటే పూర్తి ప్రయోజనం ఉండదు.. ఆరోగ్యకరమైన డైట్ కూడా అవసరం.

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ఓట్స్‌ను రెగ్యులర్ డైట్‌లో చేర్చుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.