అన్వేషించండి

Pregnancy Care During Summer : వేసవిలో గర్భిణీలకు కలిగే ఇబ్బందులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే అంటోన్న నిపుణులు

Pregnancy Care : ప్రెగ్నెన్సీ సమయంలో నార్మల్గానే ఇబ్బందులు ఉంటాయి. అయితే సమ్మర్లో ఈ సమస్యలు మరింత ఎక్కువగా ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూసేద్దాం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వేసవి అధిక ఉష్ణోగ్రతలు గర్భిణీలకు ప్రమాదకరం, తల్లి బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం.
  • గర్భిణీల్లో డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది.
  • తీవ్రమైన తలనొప్పి, వాంతులు, బేబీ మూమెంట్స్ తగ్గితే వెంటనే వైద్యం.
  • శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోండి, లూజ్ కాటన్ దుస్తులు ధరించండి.

Pregnancy Care During Heatwaves : వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు సాధారణ ప్రజలకే ఇబ్బందిగా ఉంటే.. గర్భిణీలకు మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. గర్భధారణ సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులు, పెరిగిన బరువు, అలసట వంటి కారణాల వల్ల గర్భిణీలు వేడి ప్రభావానికి త్వరగా గురవుతారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హీట్‌వేవ్స్ సమయంలో తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యంపైనా ప్రభావం పడే ప్రమాదం ఉంటుంది.

యశోద హాస్పిటల్స్​లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాపరోస్కిపిక్ సర్జన్​గా చేస్తోన్న డాక్టర్ లేపాక్షి దాసరి ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. లేపాక్షి ప్రకారం గర్భిణీల శరీరం ఒకేసారి రెండు ప్రాణాలకు తగ్గట్లు వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది సాధారణ వ్యక్తులతో పోలిస్తే చాలా ఎక్కువ. ప్రెగ్నెన్నీ సమయంలో రక్తప్రసరణ పెరగడం, గుండె ఎక్కువగా పనిచేయడం వల్ల శరీరంపై అదనపు ఒత్తిడి ఉంటుంది. ఇలాంటి సమయంలో ఎండ తీవ్రత ఎక్కువైతే శరీరంలోని కూలింగ్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవచ్చు. దీంతో డీహైడ్రేషన్, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

హీట్‌వేవ్స్ వల్ల కలిగే ప్రమాదాలు

వేసవిలో ఎక్కువసేపు ఎండలో ఉండటం వల్ల గర్భిణీలకు తల తిరగడం, వాంతులు, నీరసం, అలసట వంటి సమస్యలు రావచ్చు. ఇవి హీట్ ఎగ్జాషన్ సంకేతాలుగా భావించాలి. సరైన సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది హీట్ స్ట్రోక్‌గా మారుతుంది. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయికి చేరుకోవడం, స్పృహ కోల్పోవడం, గందరగోళానికి గురికావడం వంటి లక్షణాలు కనిపించొచ్చు.

డీహైడ్రేషన్ కూడా గర్భిణీల్లో పెద్ద సమస్యగా మారొచ్చు. శరీరంలో నీరు తగ్గిపోతే గర్భాశయంలో సంకోచాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కాళ్లు, పాదాల్లో వాపు, కండరాల పట్టేసినట్లు అనిపించడం, లో బీపీ, చర్మంపై హీట్ రాషెస్, సన్‌బర్న్ వంటి సమస్యలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం తీవ్రమైన ఎండలో ఎక్కువకాలం ఉండటం వల్ల ప్రీటర్మ్ డెలివరీ లేదా తక్కువ బరువుతో శిశువు పుట్టే ప్రమాదం కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

వైద్యుడి సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే

తలనొప్పి తీవ్రంగా వచ్చినా, తరచూ తల తిరగడం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం, గందరగోళం, బేబి మూమెంట్స్ తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యసహాయం తీసుకోవాలని డాక్టర్ లేపాక్షి తెలిపారు. శరీర ఉష్ణోగ్రత 40 కంటే ఎక్కువగా ఉంటే కూడా వైద్య సహాయం తీసుకోవాలి. 

గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వేసవిలో గర్భిణీలు ఇబ్బంది లేకుండా ఉండాలంటే.. రోజంతా నీరు, కొబ్బరి నీళ్లు, తాజా ఫ్రూట్ జ్యూసులు తీసుకుంటూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. కాఫీ, టీ, షుగర్ డ్రింక్స్​కి దూరంగా ఉండాలి. పుచ్చకాయ, దోసకాయ, నారింజ వంటి వాటిలో నీరు ఎక్కువగా ఉంటుంది. పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ఆయిల్, మసాలా ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించాల్సి ఉంటుంది. 

లూజ్‌గా ఉండే కాటన్ దుస్తులు వేసుకోవడం వల్ల శరీరానికి గాలి అందుతుంది. బయటకు వెళ్లేటప్పుడు టోపీ, గొడుగు వాడటం మంచిది. ఎండలో ఎక్కువసేపు ఉండకూడదు. తరచూ స్నానం చేయడం, తడి గుడ్డతో శరీరాన్ని తుడుచుకోవడం, వాపు ఉన్న కాళ్లను ఎత్తుగా పెట్టుకోవడం ఉపశమనం ఇస్తాయి. వైద్యుల సూచనల ప్రకారం ఇంట్లోనే తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఎక్కువ శ్రమ పడే పనులు చేయకూడదు. అలా అలసట దూరం చేసుకునేందుకు సరిపడా నిద్ర, విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. 

వేసవిలో హీట్‌వేవ్స్ గర్భిణీల ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నప్పటికీ.. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. హైడ్రేషన్, సరైన ఆహారం, విశ్రాంతి, చల్లటి వాతావరణం, అలాగే హెచ్చరిక సంకేతాలపై అవగాహన ఉండటం తల్లి, బిడ్డ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget