Dengue in Monsoon : వర్షాకాలంలో డెంగ్యూ వచ్చే అవకాశాలెక్కువ.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రికవరీ టిప్స్ ఇవే
Monsoon Diseases : సీజన్ మారుతుంది. ఈ సమయంలో డెంగ్యూ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రికవరీ టిప్స్ ఏంటో చూసేద్దాం.

Dengue Prevention Tips : ఎండవేడిని తగ్గిస్తూ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఈసారి అనుకున్న దానికంటే ముందుగానే వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. సమ్మర్ నుంచి విముక్తి దొరుకుతుంది అనిపించినా.. వర్షాకాలంలో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డెంగ్యూ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. మరి ఈ సమయంలో డెంగ్యూ వ్యాప్తికి గల కారణాలేంటో.. ఎలా నివారించాలో.. తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూసేద్దాం.
డెంగ్యూ వ్యాప్తికి కారణాలు..
డెంగ్యూ దోమల ద్వారా వ్యాపించే ఓ వైరల్ వ్యాధి. దీని వ్యాప్తి వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే వర్షాల కారణంగా పూల కుండీల్లో, గుంటల్లో, చెత్తల్లో నీరు ఎక్కువగా పేరుకుపోతుంది. వాటితో పాటు డ్రైనేజీలు, శుభ్రంగా లేని ప్రదేశాల్లో.. ఏడిస్ దోమలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. తేమతో కూడిన వాతావరణంలో ఇవి వేగంగా పునరుత్పత్తి చెంది.. ఎక్కువకాలం జీవించేలా చేస్తాయి. దీనివల్ల డెంగ్యూ వ్యాప్తి ఎక్కువ అవుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోండి. దోమలు ఇంట్లోకి చేరకుండా నెట్స్, రెప్లెంట్స్ వంటివి ఉపయోగించండి. దోమలు కుట్టకుండా స్లీవ్స్ ఫుల్‌గా ఉండే డ్రెస్‌లు, ప్యాంట్లు వేసుకోవాలి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో వీటి అటాక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో జాగ్రత్తగా ఉండండి.
డెంగ్యూ రికవరీ టిప్స్..
డెంగ్యూ రాకూడదని ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్నిసార్లు అది అటాక్ అవుతుంది. అలా డెంగ్యూ వచ్చినప్పుడు కోలుకునేందుకు అయ్యేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.
విశ్రాంతి : డెంగ్యూ వచ్చినప్పుడు తీవ్రమైన తలనొప్పి, కళ్లు తిరగడం, నీరసంగా ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు శరీరానికి విశ్రాంతినివ్వాలి. దీనివల్ల వైరస్ నుంచి రికవర్ అవుతారు.
హైడ్రేషన్ : డెంగ్యూ సమయంలో వాంతులు, డయోరియా ఫీవర్ వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు నీటిని, కొబ్బరి నీటిని, ఓఆర్ఎస్, జ్యూస్‌లు తీసుకోవచ్చు.
పోషకాహారం : శరీరానికి ఈజీగా జీర్ణమయ్యే, శక్తిని పెంచే ఫుడ్స్‌ని ఇస్తే మంచిది. కిచిడీ, సూప్స్, ఉడికించిన కూరగాయలు, బొప్పాయి, దానిమ్మ, కివీ, యాపిల్స్ వంటి పండ్లు తినవచ్చు. గుడ్లు, పప్పు, చికెన్ సూప్, టోఫును ప్రోటీన్ సోర్స్ కోసం తీసుకోవచ్చు.
చికిత్స : జ్వరం లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్య సహాయం తీసుకుంటే పరిస్థితి విషమించకుండా ఉంటుంది. వైద్యులు ఇచ్చే మెడికేషన్‌ను ఫాలో అవ్వాలి. ప్లేట్లెట్ కౌంట్‌ను రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ కూడా డెంగ్యూను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.
కొందరు డెంగ్యూ సమయంలో బొప్పాయి ఆకు రసం తీసుకుంటారు. ఇది చాలా పాపులర్. కానీ ఇది ప్రత్యామ్నాయం కాదు. అలాగే స్పైసీ, డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. ఇమ్యూనిటీని పెంచే ఫుడ్స్ తీసుకోవాలి. ఇవన్నీ డెంగ్యూ వచ్చినా.. త్వరగా కోలుకోవడంలో హెల్ప్ చేస్తాయి.






















