అన్వేషించండి

Dengue Fever Prevention : డెంగ్యూ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. ప్లేట్ కౌంట్​ని పెంచే ఇంటి చిట్కాలివే

Natural Dengue Prevention Methods : వర్షాలతో పాటు దోమల బెడద కూడా ఎక్కువైంది. దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో డెంగ్యూ రాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలట.

Dengue Fever Natural Remedies : వర్షాకాలం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు వస్తున్నాయి. ఈ సమయంలో దోమల సమస్య కూడా ఎక్కువగానే ఉంటుంది. దోమల వ్యాప్తి నీటి ద్వారే ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల దోమలు పెరిగి.. వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వివిధ వ్యాధులు విజృంభిస్తాయి. వాటిలో డెంగ్యూ ఒకటి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో డెంగ్యూ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలను డెంగ్యూనుంచి ఇలా కాపాడండి అంటూ పలు సూచనలు ఇస్తున్నారు. అవేంటంటే.. 

డెంగ్యూ అనేది వైరస్ సోకిన ఏడిస్ దోమల ద్వారా వస్తుంది. పిల్లలు కూడా దీనివల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కీళ్ల, కండరాల నొప్పి, దొద్దుర్లు, అలసట వంటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లండి. అంతేకాకుండా డెంగ్యూ రాకుండా నిపుణులు కొన్నిసూచనలు ఇస్తున్నారు. వాటిని కూడా ఫాలో అయితే పిల్లల్లో డెంగ్యూ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్తున్నారు. 

నీరు నిల్వ ఉండే ప్రాంతాలపై దృష్టి

ఇంటి పరిసర ప్రాంతాల్లో దోమలు ఎక్కువగా ఉండే ప్రదేశాలను గుర్తించండి. ఏడిస్ దోమలు నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్రాంతాల్లో సంతానోత్పత్తి చేస్తాయి. కాబట్టి ఇంట్లో పూలకుండీలు, బకెట్లు, టైర్లు వంటి ప్రాంతాలపై శ్రద్ధ వహించాలి. నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు కుట్టకుండా శరీరంపై క్రీమ్​లు రాసుకోవాలి. దోమలను దూరం చేసే ఆయిల్స్ మార్కెట్​లో అందుబాటులో ఉంటాయి. ఇవి చర్మానికి హాని చేయకుండా దోమల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. కళ్లు, చేతులు వంటి ప్రాంతాల్లో ఈ తరహా ఆయిల్స్, క్రీమ్స్ లేకుండా చూసుకోవాలి. 

ఈ మార్పులు తప్పనిసరి

వర్షం వచ్చే సమయంలో ఎలాగో చలి వేస్తుంది. కాబట్టి దోమలు, చలి నుంచి శరీరాన్ని రక్షించుకునేందుకు పొడవాటి దుస్తులు వేసుకోవాలి. సాక్స్​లు, గ్లౌవ్స్ ధరిస్తే మరీ మంచిది. బయటకు వెళ్లినప్పుడు వీటిని వేసుకుంటే మంచిది. లేత రంగు దుస్తులు కూడా దోమలు కుట్టకుండా కంట్రోల్ చేస్తాయి. కిటికీలు, తలుపులు మూసి ఉంచితే దోమలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఫ్యాన్స్ వేసుకోవడం వల్ల కూడా దోమల నుంచి విముక్తి ఉంటుంది. సాయంత్రం వేళ బయటకు వెళ్లకపోవడమే మంచిది. నిపుణుల సలహాలు తీసుకుంటూ.. డెంగ్యూ రాకుండా జాగ్రత్త పడొచ్చు. 

ఇంటి చిట్కాలు..

డెంగ్యూ సమయంలో శరీరంలో ప్లేట్​లెట్స్ తగ్గిపోతాయి. వీటిని కంట్రోల్ చేసేందుకు పలు ఇంటి చిట్కాలు హెల్ప్ అవుతాయి. బొప్పాయి ప్లేట్​కౌంట్​ని పెంచుతుందని చెప్తారు. అలాగే బొప్పాయి ఆకుల రకం కూడా మంచిదంటారు. గోధుమ గడ్డి రసంలో నిమ్మరసం పిండి తాగితే ప్లేట్​లెట్స్ పెరుగుతాయంటారు. కిస్​మిస్​లు నైట్​ నానబెట్టి ఉదయం తినడం, మెంతి గింజలు నానబెట్టిన నీటిని తాగడం, కలబంద, బీట్ రూట్, క్యారెట్​ జ్యూస్ తీసుకోవడం వంటివి ప్లేట్​లేట్స్ పెంచుతాయంటారు. అయితే ఇవి కేవలం ప్రత్యామ్నాయం మాత్రమే. వైద్యుల సలహాలు లేకుండా తీసుకోకూడదని చెప్తున్నారు నిపుణులు. వైద్యుల సూచనల మేరకే వీటిని పాటించాలని లేదంటే ప్రాణాపాయ స్థితి తప్పదని అంటున్నారు. 

Also Read : వర్షాకాలంలో ఇమ్యూనిటీని ఇలా పెంచుకోండి.. ఆ ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండాలట

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh: ఏపీలో మరో 7 విమానాశ్రయాలు, 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి: రామ్మోహన్‌ నాయుడు
ఏపీలో మరో 7 విమానాశ్రయాలు, 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి: రామ్మోహన్‌ నాయుడు
Alla Nani: వైఎస్‌ఆర్‌సీపీకి ఆళ్ల నాని రాజీనామా- జిల్లా పార్టీ కార్యాలయం ఖాళీ
వైఎస్‌ఆర్‌సీపీకి ఆళ్ల నాని రాజీనామా- జిల్లా పార్టీ కార్యాలయం ఖాళీ
Siddaramaiah: సిద్దరామయ్యకి పదవి గండం! భూ కుంభకోణం కేసులో విచారణకు అంతా సిద్ధం
సిద్దరామయ్యకి పదవి గండం! భూ కుంభకోణం కేసులో విచారణకు అంతా సిద్ధం
Jatadhara First Look:  ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సుధీర్ బాబు- మెస్మరైజ్ చేస్తున్న ‘జటాధార‘ ఫస్ట్ లుక్
ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సుధీర్ బాబు- మెస్మరైజ్ చేస్తున్న ‘జటాధార‘ ఫస్ట్ లుక్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ponniyin Selvan 1 Bags 4 National Awards | జాతీయ అవార్డుల్లో పొన్నియన్ సెల్వన్ హవా | ABP DesamRishab Shetty National Best Actor Award | రిషభ్ శెట్టి కి జాతీయ ఉత్తమనటుడి పురస్కారం | ABP DesamNithya Menen National Best Actress | నిత్యా మీనన్ కు జాతీయ ఉత్తమనటి పురస్కారం | ABP DesamKarthikeya 2 National Award | జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తికేయ 2 కు అవార్డు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh: ఏపీలో మరో 7 విమానాశ్రయాలు, 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి: రామ్మోహన్‌ నాయుడు
ఏపీలో మరో 7 విమానాశ్రయాలు, 2026 జూన్ నాటికి భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తి: రామ్మోహన్‌ నాయుడు
Alla Nani: వైఎస్‌ఆర్‌సీపీకి ఆళ్ల నాని రాజీనామా- జిల్లా పార్టీ కార్యాలయం ఖాళీ
వైఎస్‌ఆర్‌సీపీకి ఆళ్ల నాని రాజీనామా- జిల్లా పార్టీ కార్యాలయం ఖాళీ
Siddaramaiah: సిద్దరామయ్యకి పదవి గండం! భూ కుంభకోణం కేసులో విచారణకు అంతా సిద్ధం
సిద్దరామయ్యకి పదవి గండం! భూ కుంభకోణం కేసులో విచారణకు అంతా సిద్ధం
Jatadhara First Look:  ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సుధీర్ బాబు- మెస్మరైజ్ చేస్తున్న ‘జటాధార‘ ఫస్ట్ లుక్
ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో సుధీర్ బాబు- మెస్మరైజ్ చేస్తున్న ‘జటాధార‘ ఫస్ట్ లుక్
Electricity Bill: తప్పు తెలుసుకున్న విద్యుత్ డిస్కంలు- పేమెంట్‌ యాప్స్‌ ద్వారా బిల్లుల చెల్లింపు విధానం పునరుద్ధరణ
తప్పు తెలుసుకున్న విద్యుత్ డిస్కంలు- పేమెంట్‌ యాప్స్‌ ద్వారా బిల్లుల చెల్లింపు విధానం పునరుద్ధరణ
Dubai Police Force Cyber ​​Truck :  టెస్లా సైబర్ ట్రక్స్‌తో దుబాయ్ పోలీసుల గస్తీ - ఎంత ఖరీదైన కారైనా ముందు వాళ్లు వాడాల్సిందే !
టెస్లా సైబర్ ట్రక్స్‌తో దుబాయ్ పోలీసుల గస్తీ - ఎంత ఖరీదైన కారైనా ముందు వాళ్లు వాడాల్సిందే !
Nidhi Agarwal: 'రాజా సాబ్‌' సెట్‌లో నిధి అగర్వాల్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ - గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పిన మూవీ టీం
'రాజా సాబ్‌' సెట్‌లో నిధి అగర్వాల్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌ - గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పిన మూవీ టీం
Hyderabad Road Accident: హైదరాబాద్‌లో స్కూల్ పిల్లల ఆటోను ఢీ కొట్టిన టిప్పర్‌- పదో తరగతి విద్యార్థి మృతి
హైదరాబాద్‌లో స్కూల్ పిల్లల ఆటోను ఢీ కొట్టిన టిప్పర్‌- పదో తరగతి విద్యార్థి మృతి
Embed widget