అన్వేషించండి

Bha Bha Ba OTT : తెలుగులోనూ మలయాళ యాక్షన్ కామెడీ 'భా భా బా' - కీ రోల్‌లో మోహన్ లాల్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Bha Bha Ba OTT Platform : మలయాళ స్టార్ దిలీప్ ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ 'భా భా బా'. తాజాగా తెలుగు వెర్షన్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.

Mohan Lal's Bha Bha Ba Telugu Version OTT Streaming : మలయాళ స్టార్స్ దిలీప్, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ 'భా భా బా'. గతేడాది డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా తాజాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

ఎందులో స్ట్రీమింగ్ అంటే?

'భా భా బా' మలయాళ వెర్షన్ ఇప్పటికే ప్రముఖ ఓటీటీ 'ZEE5'లో స్ట్రీమింగ్ అవుతోంది. దాదాపు 10 రోజుల తర్వాత మంగళవారం నుంచి తెలుగు వెర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. మూవీకి ధనుంజయ్ శంకర్ దర్శకత్వం వహించగా... వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్, రెడిన్ కింగ్ స్లే, సాండీ మాస్టర్, బాలు వర్గీస్, సిద్ధార్థ్ భరతన్, బైజు సంతోష్, సర్న్య పొనవన్ నటించారు.

మలయాళ స్టార్స్ దిలీప్, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ 'భా భా బా'. గతేడాది డిసెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా తాజాగా తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ZEE5 Telugu (@zee5telugu)

Also Read : అమెజాన్ ప్రైమ్ కాదు.. మరో ఓటీటీలోనూ 'డ్రైవ్' - ఆది పినిశెట్టి సైబర్ థ్రిల్లర్ ఎందులో చూడొచ్చంటే?

లైంగిక ఆరోపణల కేసు నుంచి రిలీఫ్ పొందిన తర్వాత మలయాళ స్టార్ దిలీప్ 'భా భా బా'తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మోహన్ లాల్ కీలక పాత్ర పోషించడంతో మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే, స్పూఫ్ కామెడీని కొందరు ఇష్టపడగా... మరికొందరిని అంతగా ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్సే వచ్చినప్పటికీ ఆ తర్వాత వసూల్లు తగ్గాయి. సినిమా మొత్తం రూ.23.10 కోట్ల కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.

స్టోరీ ఏంటంటే?

కేరళలో సీఎంగా జోసెఫ్ (బైజు సంతోష్) ఘన విజయం సాధిస్తాడు. తొలిసారిగా బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా అతన్ని కిడ్నాప్ చేస్తారు. దీంతో పోలీసులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంటుంది. సీఎం కొడుకు నోబుల్ (వినీత్ శ్రీనివాసన్) ఎన్ఐఏ ఏజెంట్‌గా పని చేస్తుండగా... తన తండ్రి కిడ్నాప్ కేసు ఛేదించేందుకు స్వయంగా రంగంలోకి దిగుతాడు. తనతో కలిసి పని చేసేందుకు ఓ పవర్ ఫుల్ టీం సెట్ చేసుకుంటాడు.

విచారణలో భాగంగా తన తండ్రిని కిడ్నాప్ చేసింది రాడార్ (దిలీప్) అని నోబుల్‌కు తెలుస్తుంది. పగతోనే ఇలా చేసినట్లు గుర్తిస్తాడు. రాడార్‌కు ఘిల్లీ బాల (మోహన్ లాల్)తో కూడా సంబంధాలు ఉన్నాయనే విషయం తెలుస్తుంది. అసలు ఘిల్లీ బాల ఎవరు? రాడార్‌కు జోసెఫ్‌కు సంబంధం ఏంటి? తన తండ్రిని నోబుల్ రక్షించుకోగలిగాడా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Pyaar Prema Kalyanam OTT : డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
డైరెక్ట్‌గా ఓటీటీలోకి తెలుగమ్మాయి మూవీ - తమిళ రొమాంటిక్ డ్రామా స్ట్రీమింగ్... ట్రైలర్ చూశారా?
Love Entertainer OTT : మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
మూడేళ్ల తర్వాత ఓటీటీలోకి ప్రేమదేశం - రెండు ఓటీటీల్లో లవ్ రొమాంటిక్ మూవీ
Janhvi Kapoor: ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
ఓటీటీలోకి జాన్వీ కపూర్... తమిళ వెబ్ సిరీస్‌లో ఆమె పాత్ర అదేనా?
Love Drama OTT : సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్
సంతోష్ శోభన్ లవ్ రొమాంటిక్ మూవీ - ఐదేళ్ల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
అమరావతి పనుల ప్రారంభోత్సవానికి పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారాయణ ఆహ్వానం.. డిప్యూటీ సీఎం హాజరవుతారా
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Embed widget