YCP Leaks Janasena MLA Videos | జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణలు | ABP Desam
జనసేన నేత, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది. ప్రభుత్వ విప్ గా ఉన్న అరవ శ్రీధర్ ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగిపై ఏడాదిన్నరగా వేధింపులకు పాల్పడుతున్నారని...ఆమెపై అత్యాచారం చేసి ఆమె గర్భవతి అయితే అబార్షన్ చేయించుకోవాలంటూ వేధిస్తున్నాడంటూ కొన్ని వ్యక్తిగత వీడియోలను వాట్సాప్ ఛాట్ లను వైసీపీ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన కోరిక తీర్చాలంటూ ఎమ్మెల్యే వేధించారని చెబుతూ ప్రైవేట్ వీడియో కాల్స్, వాట్సప్ చాట్ లను వైసీపీ పోస్ట్ చేసింది.
మహిళలకు కూటమి ప్రభుత్వం కల్పించే రక్షణ ఇదేనా అంటూ ప్రశ్నించిన వైసీపీ...ఇది జనసేన కాదు కామసేన అంటూ వరుస పోస్టులు పెట్టింది.. రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన నేత అరవ శ్రీధర్ పై తనను ఏడాదిన్నరగా వేధిస్తున్నారంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగిని సెల్ఫీ వీడియోను విడుదల చేసింది. తనపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా తనను అబార్షన్ చేయించుకోవాలంటూ వేధిస్తున్నాడని...తన మూడేళ్ల కొడుకును చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడంటూ ఆ మహిళ వీడియోలో ఆరోపణలు చేసింది.























