Immunity Boosters : వర్షాకాలంలో ఇమ్యూనిటీని ఇలా పెంచుకోండి.. ఆ ఫుడ్స్‌కి వీలైనంత దూరంగా ఉండాలట
Healthy Food for Rainy Season : వర్షాకాలం వచ్చేసింది. ఈ సమయంలో ఇమ్యూనిటీ తగ్గుతూ ఉంటుంది. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Strengthening the Immune System in the Rainy Season : సీజన్ మారుతుంది. ఈ సమయంలో వ్యాధులు వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా వర్షాకాలంలో ఇమ్యూనిటీ త్వరగా తగ్గిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు. అందుకే ఈ సమయంలో సీజనల్ వ్యాధులను దూరం చేయడానికి పలు రకాల ఫుడ్స్ తీసుకోవాలంటున్నారు. ఇవి ఇమ్యూనిటీని పెంచడంతో పాటు.. హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. ఇంతకీ ఎలాంటి ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో.. ఇమ్యూనిటీని ఎలా పెంచుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సీజన్ ఏది అయినా.. ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం తీసుకోవాలంటున్నారు నిపుణులు. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుందని సూచిస్తున్నారు. ఈ ఫుడ్స్ మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా కొన్నిరకాల ఫుడ్స్ తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని చెప్తున్నారు. వర్షాకాలంలో ఇవి ఆరోగ్యగంగా ఉండడంలో హెల్ప్ చేస్తాయని చెప్తున్నారు. సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు ఎలాంటివి తీసుకోవాలంటే..
వీటిని కచ్చితంగా తీసుకోవాలట..
వర్షాకాలంలో సమృద్ధిగా లభించే పండ్లు, కూరగాయలను ఎంచుకోవాలి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి ఉంటుంది. జామపండ్లు, బొప్పాయిలు, బెల్ పెప్పర్స్, బచ్చలికూర, బ్రోకలీ వంటి వాటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌తో నిండిన పోషకాలు ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా స్కిన్, హెయిర్‌కి కూడా చాలామంచిదని.. డ్యామేజ్ నుంచి రక్షిస్తాయని తెలిపారు.
ప్రోబయోటిక్స్ కచ్చితంగా తీసుకోవాలట..
ప్రోబయోటిక్స్ శరీరంలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సాహిస్తాయి. అంతేకాకుండా ఇమ్యూనిటీని పెంచుతాయి. కాబట్టి పెరుగు, మజ్జిగ, కిమ్చి వంటి ప్రోబయోటిక్స్ వంటి పులియబెట్టిన ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. వీటిని రెగ్యూలర్‌గా ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది. ఇది సీజనల్ వ్యాధులు రాకుండా హెల్ప్ చేస్తుంది.
హైడ్రేటెడ్‌గా ఉండాలి..
వర్షాకాలంలో చాలామంది నీటిని తక్కువగా తాగుతారు. కానీ వీలైనంత హైడ్రేటెడ్‌గా ఉండడం కోసం నీటిని తీసుకోవాలి అంటున్నారు. నీటిని తాగకపోతే.. హెర్బల్ టీలు, ఇంట్లో చేసిన సూప్‌లు తాగితే మంచిది. ఇవి శరీరంలోని టాక్సిన్లను బయటకు బయటకు పంపిస్తాయి. సెల్యూలార్ ఫంక్షన్లకు మద్ధతునివ్వడానికి, రోగనిరోధక వ్యవస్థ పనితీరును ఉత్తమంగా ఉంచుతాయి.
విటమిన్ సి తీసుకుంటే..
విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచడంలో హెల్ప్ చేస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్‌తో పోరడటానికి, రోగనిరోధక కణాలను బలోపేతం చేయడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి నారింజ, నిమ్మకాయలు, స్ట్రాబెర్రీలు, కివీస్, బెల్ పెప్పర్స్ వంటి వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ పండ్లు, కూరగాయల్లో విటమిన్ సి మాత్రమే కాకుండా ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవేకాకుండా.. పసుపు, అల్లం, వెల్లుల్లి, దాల్చినచెక్క, తులసి యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
వాటికి దూరంగా ఉండాలి..
ప్రాసెస్ చేసిన ఫుడ్స్‌ను వీలైనంత తగ్గించాలని సూచిస్తున్నారు నిపుణులు. షుగర్‌తో నిండిన ఫుడ్స్, పానీయాలు ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. అంతేకాకుండా త్వరగా ఇన్ఫెక్షన్లకు గురి చేస్తాయి. శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంతో పాటు.. మొత్తం ఆరోగ్యానికి మద్ధతునిస్తాయి. వైద్యులదగ్గరకు వెళ్లి వారి సూచనలు తీసుకుంటే.. ఇంకా మంచిది అంటున్నారు.
Also Read : అశ్వగంధతో అద్భుతమైన ప్రయోజనాలు.. మగవారిలో స్టామినా పెంచుతుందట, ఆడవారిలో ఆ సమస్యను దూరం చేస్తుందట