Draupathi 2 Movie : 'ద్రౌపది 2'లో ముగ్గురు విలన్స్ - మహ్మద్ బిన్ తుగ్లక్‌గా చిరాగ్... ఫస్ట్ లుక్ రిలీజ్
Chirag Jani First Look : హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'ద్రౌపది 2' నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీలో ముగ్గురు విలన్స్ నటిస్తున్నట్లు డైరెక్టర్ మోహన్ తెలిపారు.

Chirag jani As Thugluq Role In Draupathi 2 Movie : హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'ద్రౌపది' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మోహన్ జి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసుదన్ జంటగా నటించారు. ఈ మూవీకి సీక్వెల్‌గా 'ద్రౌపది 2' రాబోతోంది.
సీక్వెల్‌లో ముగ్గురు విలన్స్
ఈ మూవీలో ముగ్గురు విలన్స్ నటిస్తున్నట్లు డైరెక్టర్ మోహన్ తెలిపారు. అందులో ప్రధానంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ పాత్రలో బాలీవుడ్ యాక్టర్ చిరాగ్ జానీ నటించినట్లు చెప్పారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఆకట్టుకుంటోంది. అతి తెలివైన తుగ్లక్ పాత్రను తెరపై ఆవిష్కరించడం చాలా కష్టమని... అయితే, చిరాగ్ ఆ పాత్రకు న్యాయం చేశారని సమర్థవంతంగా పోషించారని తెలిపారు.
'ఇలాంటి పాత్రను చేయాలంటే లుక్ పరంగా గంభీరంగా కనిపిస్తూనే మేథస్సు, తెలివిని బ్యాలెన్స్ చేస్తూ నటించే యాక్టర్ కావాలి. ఇలాంటి వేరియేషన్‌ను చూపించటం చాలా కష్టంతో కూడుకుంది. చిరాగ్ ఆ పాత్రలో పూర్తిగా లీనమై నటించి పాత్రలో అన్నీ రకాల ఎమోషన్స్‌ను అద్భుతంగా పలికించారు.' అని అన్నారు. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.
Terror Wears A Crown 👑
— Mohan G Kshatriyan (@mohandreamer) January 2, 2026
Unveiling the Delhi Sultanate #MohdBinThugluq.. @JaniChiragjani Nailed it.. Roaring as First-Level Antagonist🔥@richardrishi@GhibranVaibodha@Rakshana1826 @natty_nataraj @Nethajifilm1032 @SureshChandraa@AbdulNassarOffl @DoneChannel1 pic.twitter.com/4aFcfLh95E
14వ శతాబ్దంలో దక్షిణ భారతదేశపు నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో బహు భాషా చిత్రంగా రూపొందించారు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందింది. రిచర్డ్ రిషి లుక్, చక్కటి పాటలు, విజువల్స్ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెంచాయి. ఇందులో చిరాగ్ జానీ విలన్‌గా నటిస్తుండటం అంచనాలను వేరే లెవల్‌కు తీసుకెళ్లాయి.
ద్రౌపది 2లో రిచర్డ్ రిషి,రక్షణ ఇందుసుదన్‌లతో పాటు నట్టి నటరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే, ఈ వై.జి. మహేంద్రన్, నడోడిగల్ బరాణి, సరవణ సుబ్బయ్య, వెల్ రామమూర్తి, సిరాజ్ జానీ, దినేష్ లాంబా, గణేష్ గౌరాంగ్, దివి, దేవయానీ శర్మ, అరుణోదయన్ తదితరులు ఇతర పాత్రల్లో అలరించనున్నారు. ఈ సినిమాను చోళ చక్రవర్తి (నేతాజీ ప్రొడక్షన్స్), జి.ఎం. ఫిల్మ్ కార్పొరేషన్‌తో కలిసి నిర్మించారు. ఫిలిప్ ఆర్. సుందర్ సినిమాటోగ్రఫీ అందించగా, గిబ్రాన్ సంగీతాన్ని అందించారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి, ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. మూవీ రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు.
Before You Go
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
ట్రెండింగ్ వార్తలు























