Honeymoon Se Hatya OTT : భర్తల్ని చంపిన భార్యలు - రియల్ సంఘటనల క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'హనీమూన్ సే హత్య'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Honeymoon Se Hatya OTT Platform : దేశంలో జరిగిన 5 ముఖ్య క్రైమ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సిరీస్ 'హనీమూన్ సే హత్య'. ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

Honeymoon Se Hatya OTT Release Date Locked : భర్తల్ని భార్యలు చంపిన ఘటనలు గతేడాది ఎక్కువగా వార్తల్లో విన్నాం. భర్త శరీరాన్ని ముక్కలుగా చేసిన ఓ భార్య బ్లూ డ్రమ్ములో పాతి పెడితే... మరో మహిళ హనీమూన్‌కు తన భర్తను తీసుకెళ్లి అక్కడ చంపించేసింది. ఈ రియల్ ఘటనల ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ను రూపొందించారు. తాజాగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ అనౌన్స్ చేశారు.
ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
దేశంలో జరిగిన 5 ముఖ్య క్రైమ్ సంఘటనల ఆధారంగా 'హనీమూన్ సే హత్యా' పేరుతో ఈ సిరీస్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. అజితేష్ శర్మ దర్శకత్వం వహించగా... డాక్యుమెంటరీ సిరీస్‌గా తీశారు. బ్లూ డ్రమ్ కేసుతో పాటు హనీమూన్ హత్య కేసుతో పాటు మరో 3 కేసుల్ని చూపించనున్నారు. ప్రముఖ ఓటీటీ 'ZEE5'లో ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'అది అప్పటివరకూ సంతోషంగా ఉన్నట్లు అనిపించింది. కానీ కాదు.' అంటూ సదరు ఓటీటీ సంస్థ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
View this post on Instagram
Also Read : నో డైలాగ్స్... ఓన్లీ సైలెన్స్ - సరికొత్త సైలెంట్ మూవీ 'గాంధీ టాక్స్'... టీజర్ చూశారా?
స్టోరీ ఏంటంటే?
గతేడాది భర్తల్ని భార్యలు చంపించిన ఘటనలు ఆందోళన కలిగించాయి. దేశంలోనే సంచలనం కలిగించిన కొన్ని క్రైమ్ ఘటనలను ఆధారంగా తీసుకుని ఈ సిరీస్ రూపొందించారు. అందులో ఫస్ట్ కేస్ బ్లూ డ్రమ్ కేసు... ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన క్రైమ్ ఘటన ఇది. మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్... ముస్కాన్ అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ బంధం అతని పాలిట శాపం అయ్యింది. కొన్నాళ్లకు భర్తను కాదనుకున్న ముస్కాన్ ప్రియుడు సాహిల్‌తో కలిసి సౌరభ్‌ను కిరాతకంగా చంపేసింది. ఆపై శరీర భాగాలను ముక్కలు చేసి బ్లూ డ్రమ్ములో పడేసింది. సౌరభ కుమార్తె తన తండ్రి డ్రమ్ములో ఉన్నాడని ఇరుగుపొరుగు వారికి చెప్పడంతో విషయం బయటకొచ్చింది.
ఇక హనీమూన్ హత్య కేసు దేశంలో సంచలనం సృష్టించింది. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ... సోనమ్‌ను పెళ్లి చేసుకుని హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లారు. ఆ తర్వాత ఇద్దరూ అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెంది పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. విచారణలో 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని అక్కడ జలపాతం సమీపంలో పోలీసులు గుర్తించారు. శరీరంపై కత్తి గాట్లు ఉండడంతో హత్యగా అనుమానించారు. ఆ తర్వాత ముమ్మర దర్యాప్తు చేయగా... యూపీలో ఘాజీపూర్‌లో అతని భార్య ప్రత్యక్షమైంది. ఆమెను విచారించగా ప్రియుడితో కలిసి భర్తను చంపించినట్లు తేలింది. దీని కోసం ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్‌ను సైతం మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ కేసులతో పాటే మరో 3 కేసులను కూడా ఈ సిరీస్‌లో చూపించారు.






















