Jetlee Glimpse : విశ్వదాభిరామ... నేనెవడ్రా మామ - నవ్వులు పూయిస్తోన్న కమెడియన్ సత్య 'జెట్లీ' గ్లింప్స్... మార్నింగ్ షో ఫుల్ మీల్స్ కన్ఫర్మ్
Jetlee Glimpse Reaction : కమెడియన్ సత్య హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'జెట్లీ'. తాజాగా ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయగా నవ్వులు పూయిస్తోంది.

Comedian Satya's Jetlee Glimpse Out Now : కమెడియన్ సత్య హీరోగా మారారు. ఆయన ప్రధాన పాత్రలో రితేశ్ రానా దర్శకత్వంలో సెటైరికల్ కామెడీ ఎంటర్టైనర్ 'జెట్లీ'తో రాబోతున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా నవ్వులు పూయిస్తోంది. కామెడీ ఫుల్ మీల్స్ అందించనున్నట్లు తెలుస్తోంది.
వేమన పద్యంతో...
'జెట్లీ' టైటిల్ గ్లింప్స్ వేమన పద్యంతో ప్రారంభమై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. 'మేడిపండు చూడ మేలిమై ఉండు. పొట్ట విప్పి చూడ పురుగులుండు. పిరికివాని మదిని బింకమీలాగురా విశ్వదాభిరామ... ఇంతకీ నేనెవడినిరా మామ...' అంటూ సత్య చెప్పే డైలాగ్ నవ్వులు పూయించింది. డిఫరెంట్ లుక్‌తో తనదైన కామెడీ టైమింగ్‌తో సత్య అదరగొట్టారు.
ఓ విమానంలో హైజాక్ పరిస్థితుల మధ్య కామెడీగా తనదైన యాక్షన్‌తో సత్య చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. గ్లింప్స్ క్లైమాక్స్‌లో వెన్నెల కిశోర్... 'నువ్వు హీరోవా.... టైర్ వన్నా... టైర్ టూనా... టైర్ త్రీనా...' అని ప్రశ్నించగా... సత్య జనరల్ కంపార్ట్‌మెంట్ అంటూ తనదైన స్టైల్‌లో బదులివ్వడం నవ్వులు పూయించింది.
Also Read : ముగ్గురు భామలతో ప్రభాస్ డ్యాన్స్ - బ్లాక్ బస్టర్ సాంగ్ రీమిక్స్... 'నాచే నాచే' ప్రోమో చూశారా!
మూవీలో కమెడియన్ సత్య సరసన రియా సింఘా హీరోయిన్‌గా చేస్తున్నారు. వీరితో పాటే వెన్నెల కిశోర్, హర్ష చెముడు, అజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి, హేమలత నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ తన కామెడీతో అలరించిన సత్య ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఫస్ట్ మూవీలోనే ఓ డిఫరెంట్ లుక్, న్యూ కాన్సెప్ట్‌తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ఈ ఏడాది సమ్మర్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మార్నింగ్ షోలోనే ఫుల్ మీల్స్
ఈ సినిమా మార్నింగ్ షోలోనే ఫుల్ మీల్స్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. ఓ దర్శకుడిగా తనకు జన్మనిచ్చింది కమెడియన్ సత్య అని డైరెక్టర్ రితేష్ రానా తెలిపారు. 'సత్య అభిమానులకు ఒకటే మాట చెబుతున్నా. మీకు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసే అలవాటు లేకుంటే మార్నింగ్ షోకు రావొద్దు. ఎందుకంటే ఈ మూవీ మార్నింగ్ షోలోనే ఫుల్ మీల్స్ పెడతాం. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కిస్తున్నాం. సినిమా షూటింగ్ అంతా విమానంలోనే తీశాం. 60 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది.' అని తెలిపారు.
యాక్షన్‌లోనూ కామెడీ...
ఈ మూవీలో హీరో అంటూ ఏమీ ఉండదని సత్య తెలిపారు. సినిమా కోసం మార్షల్ ఆర్ట్ నాన్ చాక్ నేర్చుకున్నట్లు చెప్పారు. ఆడియన్స్ యాక్షన్‌లోనూ కామెడీ ఫీల్ అవుతారని... ఈ ఏడాది సమ్మర్‌కు 'జెట్లీ' ప్రేక్షకుల ముందుకు వస్తుందన్నారు.






















