Nari Nari Naduma Murari Surprise : 'నారీ నారీ నడుమ మురారి'లో బిగ్ సర్‌ప్రైజ్ - శర్వానంద్‌తో శ్రీవిష్ణు... డబుల్ ఫన్ ఎంటర్టైన్మెంట్ కన్ఫర్మ్ అయినట్లేగా...
Sree Vishnu : చార్మింగ్ స్టార్ శర్వానంద్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారీ నారీ నడుమ మురారి' నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీలో కీలక రోల్‌లో మరో హీరో నటించబోతున్నారు.

Actor Sree Vishnu Key Role In Sharwanand Nari Nari Naduma Murari Movie : టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా ఈ సంక్రాంతికి ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారీ నారీ నడుమ మురారి' రాబోతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ అనౌన్స్ చేశారు.
స్పెషల్ రోల్‌లో హీరో శ్రీవిష్ణు
ఈ మూవీలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ మేరకు మూవీ టీం అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది. 'స్పెషల్ ఎడిషన్... స్పెషల్ మూమెంట్' అంటూ ఓ వీడియో రిలీజ్ చేయగా... లగ్జరీ కారులో స్టైలిష్‌గా శ్రీవిష్ణు లుక్ అదిరిపోయింది. రీసెంట్‌గా 'సింగిల్' మూవీతో మంచి హిట్ అందుకున్నారు. ఇప్పుడు సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో సందడి చేయబోతున్నారు. శర్వానంద్‌తో శ్రీవిష్ణు డబుల్ కామెడీ కన్ఫర్మ్ అంటూ మూవీ లవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
Also Read : భర్తల్ని చంపిన భార్యలు - రియల్ సంఘటనల క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'హనీమూన్ సే హత్య'... స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఈ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా... శర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. వీరితో పాటే సత్య, వెన్నెల కిశోర్, నరేష్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. విశాల్ చంద్ర మ్యూజిక్ అందిస్తుండగా... ఏకే ఎంటర్టైన్మెంట్స్, అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఒకే ఆఫీసులో తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి, తన ఎక్స్ లవర్‌కు మధ్య నలిగే ఓ యువకుడి కథే 'నారీ నారీ నడుమ మురారి'. మరి ఈ ఇద్దరు భామల మధ్య శర్వా ఎన్ని పాట్లు పడ్డాడో తెలియాలంటే సంక్రాంతి వరకూ వెయిట్ చేయాల్సిందే.






















