శర్వానంద్ హీరోగా 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న సినిమాలో దియా పాత్రలో నటిస్తోంది సంయుక్త. ఈ రోజు (సెప్టెంబర్ 13న) ఆమె పుట్టినరోజు సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. శాస్త్రీయ నృత్యం చేస్తున్న ఆమె స్టిల్ నెటిజనులు ఆకట్టుకుంటోంది.
లుధీర్ బైరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్న సినిమాలోనూ సంయుక్త హీరోయిన్. అందులో ఆమె సమీర పాత్ర చేస్తున్నారు.
సంయుక్త త్వరలో హిందీ సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ కానున్నారు. 'మాహారంగి - క్వీన్ ఆఫ్ క్వీన్స్' సినిమాలో ఆవిడ నటిస్తున్నారు.
నిఖిల్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చారిత్రక సినిమా 'స్వయంభూ'లోనూ సంయుక్త నటిస్తున్నారు. ఆల్రెడీ ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' సినిమాతో సంయుక్త తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అందులో రానా జోడీగా నటించారు.
కథానాయికగా సంయుక్త ఖాతాలో రెండో తెలుగు సినిమా కూడా బ్లాక్ బస్టర్. నందమూరి కళ్యాణ్ రామ్ 'బింబిసార'లో ఆమె మోడ్రన్ అమ్మాయిగా, పోలీస్ రోల్ చేశారు.
'భీమ్లా నాయక్', 'బింబిసార' సినిమాలు సంయుక్తగా విజయాలు అందిస్తే... నటిగా ఆమెకు మరింత పేరు, విజయం తెచ్చిన సినిమా 'విరూపాక్ష'. ఆ సినిమా పతాక సన్నివేశాల్లో ఆవిడ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
కథానాయికగా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు తమిళంలో కొన్ని సినిమాలు చేశారు సంయుక్త. మళ్లీ ధనుష్ 'సార్'తో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది.
'బింబిసార' విజయం తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మరో సినిమా చేశారు. అది 'డెవిల్'. ఆ తర్వాత 'లవ్ మి'లోనూ కనిపించారు.