'దేవర'తో తెలుగు దర్శకుడు కొరటాల శివ పాన్ ఇండియా ఎంట్రీకి రెడీ అయ్యారు. దీనికి ముందు ఆయన ఏయే సినిమాలు చేశారో తెలుసా?
ఎన్టీఆర్, కొరటాల శివ మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్‌తో ఆయనకు 'దేవర' నాలుగో సినిమా. ఇంతకు ముందు రచయితగా రెండు, దర్శకుడిగా ఒక సినిమా చేశారు.
ఎన్టీఆర్, కాజల్, సమంత నటించిన 'బృందావనం' చిత్రానికి కొరటాల శివ మాటలు రాశారు. అంతకు ముందు 'ఊసరవెల్లి'కి సైతం మాటలు అందించారు.
బాలకృష్ణ 'సింహ'కు కథ, మాటలు రాసినా బోయపాటి క్రెడిట్ ఇవ్వలేదని ఒక ఇంటర్వ్యూలో కొరటాల శివ చెప్పారు. 'భద్ర', 'మున్నా', 'ఒక్కడున్నాడు', 'నిన్న నేడు రేపు' చిత్రాలకు కొరటాల రచయితగా పని చేశారు.
ప్రభాస్, అనుష్క జంటగా నటించిన 'మిర్చి' సినిమాతో కొరటాల శివ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది.
'మిర్చి' తర్వాత మహేష్ బాబు హీరోగా కొరటాల శివ 'శ్రీమంతుడు' సినిమా తీశారు. అందులో పల్లెలు, వ్యవసాయం గురించి ఆయన ఇచ్చిన సందేశం ప్రేక్షకులకు నచ్చింది. మంచి విజయం అందించింది.
'దేవర'కు ముందు ఎన్టీఆర్ ను కొరటాల డైరెక్ట్ చేసిన సినిమా 'దేవర'. అందులో మోహన్ లాల్ కీలక పాత్ర చేశారు. అది మంచి విజయం సాధించింది.
శ్రీమంతుడు' తర్వాత మహేష్ బాబుతో కొరటాల శివ చేసిన మరో సినిమా 'భరత్ అనే నేను'. సీఎం మరణం తర్వాత ఆయన కుమారుడు సిఎం అయితే అనే కథతో వచ్చింది. మంచి విజయం సాధించింది.
దర్శకుడిగా 'దేవర'కు ముందు కొరటాల శివ చేసిన సినిమా 'ఆచార్య'. చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ఆ సినిమా డిజాస్టర్ రిజల్ట్ వచ్చింది. కొరటాలకు అది తొలి ఫ్లాప్.