'దేవర'లో పవర్‌ఫుల్ డైలాగ్స్... విన్నా, చదివినా కిక్కే కిక్కు రా

Published by: Satya Pulagam

ధైర్యాన్ని చంపే భయం

మనిషికి బతికే అంత ధైర్యం చాలు... చంపే అంత ధైర్యం కాదు. కదూ కూడదు అని మళ్లీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే... ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అయితా - ఎన్టీఆర్

పని కాదు... పంతం

పని మీద పోయినోడు అయితే పని అవ్వగానే తిరిగొస్తాడు... పంతం పట్టి పోయి ఉండాడు నీ కొడుకు - ఎన్టీఆర్

తప్పుడు పనికి సంద్రం ఎక్కితే...

భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సంద్రం ఎక్కితే... ఈ రోజు నుంచి మీకు కానరాని అవుతా ఉండా - ఎన్టీఆర్

సమయం కాదు... ఆయుధం

దేవరను చంపాలంటే... సరైన సమయమే కాదు, సరైన ఆయుధం కావాలా - సైఫ్ అలీ ఖాన్

అయ్యా రూపమే వచ్చిందా?

వాడికి వాళ్ల అయ్యా రూపం వచ్చింది తప్ప రక్తం రాలేదే - జాన్వీ కపూర్

బరిలోకి దిగుతావా ఏంది?

కొంపతీసి బరిలోకి దిగుతావా ఏంది? - శ్రీకాంత్
ఏం మాట్లాడుతున్నావ్, సంపేత్తారు నన్ను - ఎన్టీఆర్

సముద్రంలో ఏం చూశాడు?

కళ్లు మూసినా తెరిచినా సంద్రంలో చూసినది కనపడుతోంది - అజయ్

భయం అసలే లేదు

ఎవరు వాళ్లంతా? - అజయ్.
'కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లలో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి' - ప్రకాష్ రాజ్

సానా పెద్ద కథ సామి

ఎవరు చేశారు ఇందంతా? - అజయ్.
సానా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ. మా దేవర కథ - ప్రకాష్ రాజ్.