అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలకు భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి తెలుగు తెర చందమామ, క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ విచ్చేశారు.
హిందీ సినిమా 'షేర్షా'లో సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అడ్వాణీ జంటగా నటించారు. రియల్ లైఫ్‌లో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అంబానీ ఇంట ఆ జంట ఇలా సందడి చేశారు.
'బొమ్మరిల్లు'లో హాసిని ఎంత పాపులర్ అంటే జెనీలియాను చూస్తే తెలుగు ప్రేక్షకులకు ముందు ఆ క్యారెక్టర్ గుర్తుకు వస్తుంది. ఆమె భర్త, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌తో కలిసి అంబానీ ఇంటికి వచ్చారు.
తెలుగు ప్రేక్షకులకు సైఫ్ అలీ ఖాన్ 'దేవర' స్టార్. ఎన్టీఆర్ సినిమాలో ఆయన కీలక పాత్ర చేస్తున్నారుగా. భార్య, స్టార్ హీరోయిన్ కరీనాతో ఆయన ట్రెడిషనల్ డ్రస్సుల్లో సందడి చేశారు.
సినిమా స్టార్లను మించిన క్రేజ్ లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ సొంతం. భార్య అంజలితో కలిసి ఆయన అంబానీ ఇంట సందడి చేశారు.
'జవాన్' సినిమాతో హిందీలోనూ తమిళ దర్శకుడు అట్లీ భారీ విజయం సొంతం చేసుకున్నారు. భార్య అట్లీతో కలిసి ఆయన అంబానీ ఇంటికి వెళ్లారు.
బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్, ఆయన కుమార్తె సోనమ్ కపూర్ తమ తమ జీవిత భాగస్వామితో అంబానీ ఇంటికి వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఇది.
'కెజిఎఫ్', 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలతో సంజయ్ దత్ సైతం సౌత్ ఆడియన్స్‌కు దగ్గర అయ్యారు. భార్య మాన్యతతో కలిసి అంబానీ ఇంటికి ఆయన విచ్చేశారు.
డిఫరెంట్ సినిమాలు చేయడం ద్వారా బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా సౌత్ ఆడియన్స్ కొంత మందికి తెలుసు. ఆయన భార్య తాహిరా కశ్యప్.
ఈ ఫోటోలో ఉన్న కథానాయికను గుర్తు పట్టారా? 'ప్రేమ పావురాలు' (సల్మాన్ ఖాన్ మైనే ప్యార్ కియా) ఫేమ్ భాగ్యశ్రీ. పక్కన ఉన్నది ఆమె భార్య హిమాలయ దాసాని.
బాలీవుడ్ డ్యాన్సింగ్ దివా, ఒక్కప్పటి స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్, ఆమె భర్త శ్రీరామ్ మాధవ్ నేనే.
'స్త్రీ 2' సినిమాతో రీసెంట్‌గా బాలీవుడ్‌లో సక్సెస్ అందుకున్న హీరో రాజ్ కుమార్ రావు. భార్య పత్రలేఖతో కలిసి ఆయన ఇలా విచ్చేశారు.
'రేసుగుర్రం' సినిమాలో విలన్, భోజ్‌పురి నటుడు, ఎంపీ రవికిషన్ తన భార్య, పిల్లలతో అంబానీ ఇంటికి విచ్చేశారు.