పండుగ సమయాల్లో పసుపు లేదా బంగారు వర్ణం చీర కడితే భలే ఉంటుంది. ఫెస్టివల్ వైబ్స్ వస్తాయి.
పట్టు... ఆ చీర కడితే అదిరేట్టుపట్టు చీరలు సైతం పండుగలకు బెస్ట్ ఆప్షన్స్. సంప్రదాయానికి చిరునామా అనేలా, మీ ఒంటి రంగుకు నప్పేలా మంచి చీర ఎంపిక చేసుకోండి.
మంచి చీర కట్టి, కొప్పున మల్లెపూలు పెడితే పండుగ కళ అంతా అమ్మాయి అప్పియరెన్స్‌లో కనబడుతుంది.
పండుగలకు వైట్ శారీ కూడా మంచి ఆప్షన్. ఎల్లో కలర్ బ్లౌజ్ అయితే భలే ఉంటుందని మీనాక్షి చౌదరిని చూస్తే తెలియడం లేదూ!
బంగారు ఆభరణాలు ధరించడం మహిళలకు అలవాటు. అప్పుడప్పుడూ పండగ సమయాల్లో కొత్తగా కనిపించడం కోసం బంగారు ఆభరణాలు కూడా ట్రై చేయొచ్చు.
ఫెస్టివల్స్ కోసం మహిళలు అందరూ మరో ఆలోచన లేకుండా ఎల్లో డ్రస్, శారీస్ షాపింగ్ చేసేయొచ్చు. పసుపు రంగు చీర, బ్లౌజ్ ఎంత అందంగా ఉన్నాయో చూడండి.
పండుగ సమయాల్లో మల్లెలు రేటు పెరుగుతాయి. జడ నిండుగా పువ్వులు పెట్టుకోవాలని అనుకుంటే మల్లెలతో పాటు కలివేరు లేదా కనకాంబరాలు ట్రై చేయవచ్చు.
చీర కట్టినప్పుడు మాత్రమే కాదు... చుడిదార్ వంటివి వేసినప్పుడు కూడా మల్లెలు, జాజి పువ్వులు కొప్పులో పెట్టుకోవచ్చు. భలే సూట్ అవుతాయి.
ఇప్పటి వరకు మీరు ట్రెడిషనల్ డ్రస్ లలో చూసిన మీనాక్షి చౌదరి మోడ్రన్ లుక్ ఇది. చేతిలో పట్టుకున్న పువ్వు వెనుక ఆమె నవ్వు చూడండి. భలే ఉంది కదూ!