'ది గోట్' తమిళనాడు థియేట్రికల్ హక్కుల్ని 76 కోట్ల రూపాయలకు విక్రయించినట్లు సమాచారం.
తమిళనాడు తర్వాత 'ది గోట్'కు హయ్యస్ట్ థియేట్రికల్ అమౌంట్ వచ్చినది ఓవర్సీస్ నుంచి. అక్కడ రూ. 55 కోట్లకు సినిమాను కొన్నారు.
ఏపీ, తెలంగాణ... తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రైట్స్ ద్వారా 'ది గోట్'కు రూ. 21 కోట్లు వచ్చాయని తెలిసింది.
కన్నడలో తమిళ సినిమాల మార్కెట్ తక్కువ. కానీ, 'ది గోట్'కు మంచి అమౌంట్ వచ్చింది. కర్ణాటక రైట్స్ రూ. 11 కోట్లు వచ్చాయని తెలిసింది.
దళపతి విజయ్‌కు కేరళలో మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడీ 'ది గోట్'కు అక్కడి నుంచి రూ. 15 కోట్లు వచ్చాయి.
సౌత్ స్టేట్స్ (తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఏపీ, తెలంగాణ) మినహాయిస్తే... రెస్టాఫ్ ఇండియా రైట్స్ ద్వారా రూ. 7 కోట్లు వచ్చాయి.
దళపతి విజయ్ 'గోట్' ఆల్ ఓవర్ / వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 185 కోట్లు!
'ది గోట్' సినిమాకు రూ. 187 కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుందని ట్రేడ్ టాక్. అంత అమౌంట్ రావాలంటే మినిమమ్ రూ. 375 గ్రాస్ రావాలట.
విజయ్ లాస్ట్ సినిమా 'లియో'కు ఫ్యాన్స్, క్రిటిక్స్, ఆడియన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా ఆ మూవీకి 600 కోట్ల గ్రాస్ వచ్చిందట. సో... 'గోట్' బ్రేక్ ఈవెన్ కావడం ఈజీ అంటున్నారు.