తాను చూసిన తొలి తెలుగు సినిమా 'జల్సా' అని హీరోయిన్ మీనాక్షి చౌదరి చెప్పారు. ఆ తర్వాత తెలుగు సినిమాలు చూడటం స్టార్ట్ చేశానన్నాను. తన వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' పవన్ కల్యాణ్ అని ఆవిడ చెప్పారు.
చిత్రసీమలో 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న బాలకృష్ణకు వెంకట్ ప్రభు కంగ్రాట్స్ చెప్పారు. తనకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్' బాలయ్య అని ఆయన చెప్పారు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'పంజా'కు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. ఈ 'గోట్' సినిమాకూ ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. స్టేజి మీద 'పంజా' టైటిల్ సాంగ్ పాడి అలరించారు.
వెంకట్ ప్రభు సోదరుడు, నటుడు ప్రేమ్ జి 'గోట్' ప్రీ రిలీజ్ స్టేజి మీద పాట పాడారు. 'గుడుంబా శంకర్' సినిమాలో 'నాయుడు బావా' ర్యాప్ పాడారు.
'గోట్' హీరో దళపతి విజయ్ హైదరాబాద్ థియేటర్లలో సినిమాలు చూస్తారని, గోకుల్ థియేటర్లో ప్రభాస్ 'సలార్' చూశారని నటుడు వైభవ్ చెప్పారు.
రీల్ లైఫ్ మాత్రమే కాదు అని, రియల్ లైఫ్‌లో కూడా పవన్ కళ్యాణ్ అని హీరోయిన్ స్నేహ అన్నారు. తెలుగులో అందరు హీరోలతో నటించినా... చిరంజీవి, పవన్ తో నటించలేదని, త్వరలో వాళ్లిద్దరితో నటించే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
'గోట్' సినిమాను తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తోంది. నైజాంలో ఉదయం 4 గంటలకు షో వేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ శశి చెప్పారు.
తెలుగులో చిరంజీవి గారు బిగ్గెస్ట్ స్టార్. కానీ, ఇప్పుడు పొలిటికల్ విషయానికి వస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పాలని 'జీన్స్' హీరో ప్రశాంత్ చెప్పారు.
విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన 'గోట్' సెప్టెంబర్ 5న విడుదల అవుతోంది. ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్. స్నేహ, లైలా కూడా నటించారు.