దీపికా పదుకోన్ ఈ రోజు (సెప్టెంబర్ 8న) ఆడ బిడ్డకు జన్మ ఇచ్చారు. వారసురాలు ఇంట అడుగు పెట్టింది.
రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ వివాహం నవంబర్ 14, 2018లో జరిగింది. వాళ్లది డెస్టినేషన్ వెడ్డింగ్. ఇటలీలో పెళ్లి చేసుకున్నారు.
పెళ్లి తర్వాత దీపికా పదుకోన్ సినిమాలు కంటిన్యూ చేశారు. సుమారు ఆరేళ్ల తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు. బిడ్డకు జన్మ ఇవ్వాలని నిర్ణయించారు.
ఫిబ్రవరి 29, 2024... రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకోన్ దంపతులు గుడ్ న్యూస్ షేర్ చేశారు. దీపిక ప్రెగ్నెంట్ అని అనౌన్స్ చేశారు.
జామ్ నగర్ వేదికగా జరిగిన అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో రణ్‌వీర్, దీపిక పాల్గొన్నారు. అక్కడికి వెళ్లడానికి ముందు ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పారు. లేదంటే కొంత ఆలస్యం చేసేవారు ఏమో!?
తొలుత సెప్టెంబర్ 28న దీపిక డెలివరీ అని వార్తలు వచ్చాయి. ఒకవేళ ఆ రోజు బిడ్డ జన్మిస్తే... యాదృశ్చికంగా అయినా సరే మరొకరి బర్త్ డే గుర్తు చేసుకోవాలి. దీపికా పదుకోన్ మాజీ బాయ్ ఫ్రెండ్, లవర్ రణ్‌బీర్ కపూర్ బర్త్ డే అది.
దీపికా పదుకోన్ లండన్ సిటీలో ప్రముఖ ఆస్పత్రిలో బిడ్డకు జన్మ ఇస్తుందని తొలుత వార్తలు వచ్చాయి. అయితే... లండన్ కాదు, ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రిలో ఆమె డెలివరీ జరిగింది.
డెలివరీ తర్వాత ఆరు నెలలు ఎటువంటి షూటింగ్స్, తన కంప్లీట్ టైం బిడ్డకు ఇవ్వాలని దీపికా పదుకోన్ డిసైడ్ అయ్యారట.
దీపికా పదుకోన్ ప్రెగ్నెంట్ అని తెలిశాక విడుదలైన మొదటి సినిమా ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'. అందులోనూ ఆవిడ ప్రెగ్నెంట్ రోల్ చేయడం విశేషం.