ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రూ. 6 కోట్ల విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరొక కోటి, వరద ప్రభావిత 400 గ్రామాలకు లక్ష చొప్పున నాలుగు కోట్లు ఇవ్వనున్నట్లు చెప్పారు.
చిరంజీవి కోటి రూపాయలు, రామ్ చరణ్ కోటి రూపాయలు... ఏపీ, తెలంగాణకు ఇద్దరూ కలిపి రెండు కోట్లు విరాళంగా ప్రకటించారు.
నందమూరి బాలకృష్ణ కోటి రూపాయలు, జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు... రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు.
ఏపీకి రూ. 1 కోటి, తెలంగాణకు రూ. 1 కోటి... రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి విరాళం ప్రకటించారు ప్రభాస్.
ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌లకు చెరో రూ. 50 లక్షలు విరాళం ప్రకటించారు మహేష్ బాబు.
అక్కినేని ఫ్యామిలీ, ఆ కుటుంబానికి చెందిన సంస్థల పేరు మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు.
ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలు... మొత్తంగా కోటి విరాళం ప్రకటించారు అల్లు అర్జున్.
నిర్మాతలు సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), నాగవంశీతో కలిసి ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌లకు చెరో రూ. 25 లక్షల విరాళం ప్రకటించారు త్రివిక్రమ్ శ్రీనివాస్
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ సినిమాలతో పాపులరైన సిద్ధూ జొన్నగలగడ్డ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో 15 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధులకు చెరో రూ. 10 లక్షలు... ఏపీలోని విజయవాడలో గల అమ్మ ఆశ్రమంతో పాటు ఇతర స్వచ్ఛంద సంస్థలకు రూ. 5 లక్షలు... మొత్తంగా రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు సాయి దుర్గా తేజ్
ఏపీకి ఐదు లక్షలు, తెలంగాణకు ఐదు లక్షలు, ఏపీ పంచాయత్ రాజ్ శాఖకు మరో ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు వరుణ్ తేజ్.
దర్శకుడు వెంకీ అట్లూరి సైతం రూ. 10 లక్షల విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో ఐదు లక్షలు ఇస్తానని చెప్పారు.
ఏపీకి రూ. 5 లక్షలు, తెలంగాణకు రూ. 5 లక్షలు... మొత్తంగా రూ. 10 లక్షలు విరాళం ప్రకటించారు విశ్వక్ సేన్.
ఏపీ, తెలంగాణ... రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధులకు చెరో రెండున్నర లక్షల చొప్పున విరాళం ఇచ్చారు అనన్య నాగళ్ల.
ఏపీకి సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 వేలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 50 వేలు... మొత్తం లక్ష రూపాయలు విరాళం ఇచ్చారు.