ముంబైలోని అంబానీ ఇంట గణేష్ చతుర్థి వేడుకలకు బాలీవుడ్ సూపర్ స్టార్స్ అంతా హాజరయ్యారు. అయితే, ఈ ఫోటోలో ఉన్న ఆవిడ ఎవరో తెలుసా? అంబానీ ఫ్యామిలీ గౌరవ మర్యాదలు అందుకున్న ఈవిడ ఎవరో తెలుసా?
రష్మిక అంటే హీరోయిన్ రష్మికా మందన్నా అనుకునేరు. ఈవిడ పేరు రష్మిక ఠాక్రే. మహారాష్ట్రలో పవర్ ఫుల్ పొలిటికల్ ఫ్యామిలీ లేడీ.
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఒకప్పటి శివసేన - ఇప్పటి మహా వికాస్ అఘాడి అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సతీమణి ఈ రష్మిక ఠాక్రే. బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో మహిళ.
రష్మిక ఠాక్రేది ముంబైలోని డోంబివిలీ. ఆవిడ బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ చేశారు. ఆమె తండ్రి పేరు మాధవ్ పట్నాకర్. ఆయన వ్యాపారవేత్త.
రష్మిక 1987లో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎల్ఐసి)లో కాంట్రాక్ ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత కొన్నాళ్లు పని చేసి మానేశారు.
ఉద్ధవ్ బాబాయ్ కొడుకు రాజ్ ఠాక్రే సోదరికి ఓ ఫ్రెండ్ ఉంది. ఆవిడ రష్మికకు ఫ్రెండ్. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఉద్ధవ్, రష్మిక మధ్య పరిచయం ఏర్పడింది. 1989లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు... ఆదిత్య, తేజస్.
రష్మిక ఠాక్రే గుర్తింపు కేవలం ఉద్ధవ్ సతీమణిగా మాత్రమే కాదు... ఆవిడకు అంటూ ఓ ఇండివిడ్యువల్ గుర్తింపు ఉంది. సామ్నా పత్రికకు ఆవిడ ఎడిటర్. 2019లో భర్త సీఎం అయ్యాక పార్టీ పత్రిక బాధ్యతలు చేపట్టారు.
అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. ఆ కొత్త జంటతో నీతూ అంబానీ