కేథరిన్ ఈజ్ బ్యాక్ - ఒక్కటి కాదు, నాలుగు సినిమాల్లో!

'బింబిసార' విజయం, 'మాచర్ల నియోజకవర్గం' తర్వాత కేథరిన్ పూర్తిస్థాయి కథానాయికగా తెరపై సందడి చేయలేదు.

రెండేళ్ల విరామం తర్వాత కేథరిన్ కొత్త సినిమా కబురుతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

వీఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న కొత్త సినిమాలో కేథరిన్ మెయిన్ హీరోయిన్. 

కేథరిన్ పుట్టినరోజు (సెప్టెంబర్ 10) సందర్భంగా వీఎన్ ఆదిత్య సినిమాలో నటిస్తున్న విషయం చెప్పారు.

కేథరిన్, వీఎన్ ఆదిత్య సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది. ఆ సెట్స్‌లో బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. 

కేథరిన్ చేతిలో ఓ తమిళ సినిమా కూడా ఉంది. ఆల్మోస్ట్ 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసింది.

తమిళంలో ప్రముఖ దర్శకుడితో కేథరిన్ చేయనున్న సినిమాను త్వరలో ప్రకటించనున్నారు. 

హిందీ నుంచి కేథరిన్ కు ఆఫర్లు వచ్చాయని సమాచారం. రెండు సినిమాలకు సంతకాలు చేశారట.

రెండేళ్లు సినిమాలు ఏవీ రాకున్నా... నాలుగు కొత్త సినిమాలు లైనులో పెట్టారు కేథరిన్.