అన్వేషించండి

MLC Kavitha Resignation Accepted: పంతం నెగ్గించుకున్న కల్వకుంట్ల కవిత!రాజీనామాను ఆమోదించిన శాసనమండలి చైర్మన్!

MLC Kavitha Resignation Accepted: ఎమ్మెల్సీ పదవికి కవిత ఇచ్చిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ ఆమోదించారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించారు.

MLC Kavitha Resignation Accepted: నిజామాబాద్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేసి నాలుగు నెలలు గడిచింది. ఎట్టకేలకు ఆమె రాజీనామాను ఆమోదించారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాలు నిరవదిక వాయిదా పడిన కొద్ది కాసేపట్లోనే కవిత రాజీనామాకు ఆమోదం తెలుపుతున్నట్లు నోటిఫికేషన్ జారీ చేశారు లెజిస్లేటివ్ సెక్రటరీ. 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్ధానం నుంచి శాసనమండలి సభ్యురాలిగా కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు. బీఆర్ ఎస్ పార్టీతో అంతర్గత విభేదాల కారణంగా గత ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన ఆ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. గడచిన సోమవారం శాసనమండలికి చివరిసారిగా హాజరై, తన రాజీనామాను ఆమోదించాలంటూ శాసన మండలి చైర్మన్ ను విజ్ఞప్తి చేశారు.

తొందరపడకండి.. మరోసారి ఆలోచించండన్నా.. పంతం వీడని కవిత..

చివరిసారి తాజాగా తెలంగాణ శాసన మండలిలో భావోద్వేగంగా ప్రసంగించిన కల్వకుంట్ల కవిత , తన రాజీనామా విషయంపై స్వయంగా చైర్మన్ కోరినా వినలేదు. తొందరపడకండి, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం సరికాదు, మీరు బాధలో ఉన్నారు. మరోసారి రాజీనామాపై పునరాలోచించండి అంటూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవితకు చివరిసారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినలేదు. తాను రాజకీయాల్లోకి అమెరికా నుంచి ఎందుకు వచ్చాను, తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి ఏర్పాటు చేయడంతోపాటు, ఉద్యమానికి , బీఆర్ ఎస్ పార్టీకి జాగృతి చేసిన కృషి గురించి మండలిలో చివరి ప్రసంగంలో మాట్లాడారు కవిత. తన తండ్రి స్థాపించిన బీఆర్ ఎస్ పార్టీలో తాను మొదటి నుంచి ఎదుర్కొంటున్న అవమానాలను ప్రస్తావిస్తూనే, బీఆర్ ఎస్ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందంటూ మండలిలో సంచలన ఆరోపణలు చేశారు. 

కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లేకుండా ఇన్నాళ్లు తాను ఎదుర్కొన్న సవాళ్లను సభలో ప్రస్తావిస్తూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు కవిత. ఉబికి వస్తున్న కన్నీళ్లతో తన ప్రసంగం ఆద్యంతం కొనసాగింది. ఇంతలా అవమానాలు ఎదుర్కొన్న తాను ఇక బీఆర్ఎస్ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిలో కొనసాగలేనని, తన రాజీనామా వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్‌ను కోరారు కవిత. 

కవిత మాటకు స్పందించిన చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి వారించే ప్రయత్నం చేసినా కవిత వినలేదు. ఇప్పటికే నాలుగు నెలలు రాజీనామా ఆమోదం కోసం ఎదురు చూశానని, అన్ని విషయాలు ఆలోచించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నానని, వెనక్కు తగ్గబోనని స్పష్టం చేశారు. కవిత రాజీనామా విషయంలో నిర్ణయం మార్చుకోవడం కష్టమని భావించిన శాసన మండలి చైర్మన్ తాజాగా ఆమె రాజీనామాకు తెలుపుతూ నోటిఫికేషన్ విడుదల చేయడంతో కవిత పంతం నెగ్గించుకున్నట్లైంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Telangana High Court: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే.. కారణం ఏంటంటే..
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
జోగులాంబ రేంజ్ DIG చౌహన్ పై వేటు..! డీజీపీ ఆఫీస్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget