అన్వేషించండి

WhatsApp is not Secure: వాట్సాప్ సురక్షితం కాదా? పైరసీపై బాంబాలు పేల్చిన ఎలాన్‌ మస్క్, పావెల్ దురోవ్!

WhatsApp is not Secure: వాట్సాప్ ప్రైవసీపై మెటా వినియోగదారులను తప్పుదారి పట్టించిందని పిటిషన్ దాఖలైంది. చాట్‌లు ప్రజలు నమ్ముతున్నంత సురక్షితంగా ఉండకపోవచ్చని ఎలాన్‌ మస్క్, పావెల్ దురోవ్  హెచ్చరించారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • వాట్సాప్ గోప్యతపై అమెరికాలో పిటిషన్, మెటా తప్పుదారి పట్టించిందని ఆరోపణ.
  • ఎలాన్ మస్క్, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు వాట్సాప్ భద్రతపై విమర్శలు.
  • మెటా సందేశాలను స్టోర్ చేసి, విశ్లేషిస్తుందని పిటిషన్‌లో పేర్కొన్నారు.
  • వాట్సాప్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తుందని మెటా ఖండించింది.

WhatsApp is not Secure: వాట్సాప్‌లో ప్రైవసీపై మరోసారి వివాదం చెలరేగింది. వాట్సాప్ మెసేజ్ గోప్యత విషయంలో వినియోగదారులను తప్పుదారి పట్టించిందని మెటాపై అమెరికాలో పిటిషన్ దాఖలైంది. దీంతో ఎలాన్ మస్క్, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ తీవ్ర విమర్శలు చేశారు. దురోవ్ వాట్సాప్‌ను "సురక్షితం కాదు" అని చెప్పారు. 2026లో కూడా వాట్సాప్ భద్రత అని భావించడం "బ్రెయిన్‌డెడ్"తో సమానమని చెప్పాడు. మస్క్ ఒక అడుగు ముందుకు వేసి, సిగ్నల్ కూడా సందేహాస్పదంగా ఉందని, X చాట్‌ను ఉపయోగించమని ప్రజలను కోరాడు.

పూర్తి ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను హామీ ఇచ్చినప్పటికీ మెటా వాట్సాప్ సందేశాలను రహస్యంగా స్టోర్‌ చేసి, విశ్లేషిస్తోందని ఆరోపించిన పిటిషన్ తర్వాత వారి కామెంట్స్ సంచలనంగా మారాయి.  

వాట్సాప్ పైరసీ పిటిషన్‌లో ఏం క్లెయిమ్ చేశారు?

ఈ పిటిషన్‌ శాన్ ఫ్రాన్సిస్కోలోని US డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలు అయ్యింది. దీనిని మొదట బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. భారతదేశం, బ్రెజిల్, ఆస్ట్రేలియా, మెక్సికో, దక్షిణాఫ్రికాకు చెందిన అంతర్జాతీయ వినియోగదారుల సమూహం దీనిని దాఖలు చేసింది.

వాట్సాప్ సందేశాలు పూర్తిగా ప్రైవేట్ అని, పంపినవారు, స్వీకరించేవారు మాత్రమే చదవగలరని మెటా వినియోగదారులను మోసం చేస్తోందని కేసులో పేర్కొంది. వాదులు ప్రకారం, మెటా వాస్తవానికి వినియోగదారు కమ్యూనికేషన్‌లోని కొన్ని పార్ట్స్‌ను స్టోర్ చేస్తుందని, విశ్లేషిస్తుంది, సందేశాల సారాంశాన్ని యాక్సెస్ చేయగలదు అని అన్నారు. 

మెటా సిస్టమ్‌లతో దగ్గరగా పనిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పేరులేని విజిల్‌బ్లోయర్‌ల సమాచారం ఆధారంగా ఈ దావా వేశారు. "మీరు మాత్రమే మీ సందేశాలను చదవగలరు" అనే వాట్సాప్ వాగ్దానం తప్పుదారి పట్టించేది. వినియోగదారులకు తప్పుడు భద్రతా భావాన్ని ఇస్తుందని వారు వాదిస్తున్నారు.

ఈ నివేదిక టెక్ లీడర్స్‌ నుంచి తీవ్ర ప్రతిచర్యలకు దారితీసింది. టెలిగ్రామ్ వాట్సాప్ ఎన్‌క్రిప్షన్‌ను అధ్యయనం చేసి " మల్టీ అటాక్‌ వెక్టర్‌లను" కనుగొన్నట్లు దురోవ్ చెప్పారు.

మస్క్ విమర్శను ప్రతిధ్వనిస్తూ, "వాట్సాప్ సురక్షితం కాదు. సిగ్నల్ కూడా ప్రశ్నార్థకం" అని పోస్ట్ చేశారు.

వాట్సాప్ గోప్యతా దావా: మెటా ప్రతిస్పందన & ప్రతిచర్యలు

మెటా ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించింది. పిటిషన్‌ను కంపెనీ "పనికిమాలినది"గా పేర్కొంది. వాదనలు సందర్భంగా చేప్పివని తప్పుడు  అసంబద్ధమని అన్నారు. వాట్సాప్ దాదాపు పదేళ్లపాటు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తోందని మెటా పేర్కొంది.

వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ కూడా మస్క్‌కు నేరుగా సమాధానం ఇచ్చారు. ఎన్‌క్రిప్షన్ కీలు వినియోగదారుల ఫోన్‌లలో ఉంటాయి కాబట్టి వాట్సాప్ సందేశాలను చదవలేదని ఆయన అన్నారు. "మాకు వాటికి యాక్సెస్ లేదు" అని ఆయన రాశారు.

ఈ కేసు వెనుక ఉన్న అదే న్యాయ సంస్థ గతంలో NSO గ్రూప్‌ను సమర్థించిందని, దీని స్పైవేర్‌ను జర్నలిస్టులు, అధికారులపై ఉపయోగించారని క్యాత్‌కార్ట్ ఎత్తి చూపారు. అతను ఈ పిటిషన్‌ను "హెడ్‌లైన్స్ లో ఉండాలనే" వారు చేస్తున్న అర్హత లేనిదిగా పేర్కొన్నారు.

ప్రస్తుతానికి కేసు ఇప్పుడే ప్రారంభమైంది. కానీ దీని కారణంగా జరుగుతున్న ప్రజా చర్చ ఇప్పటికే వినియోగదారులను వారి చాట్‌లు నిజంగా ఎంత ప్రైవేట్‌గా ఉన్నాయో ప్రశ్నించేలా చేస్తోంది.

Frequently Asked Questions

వాట్సాప్ గోప్యతపై ఎందుకు వివాదం చెలరేగింది?

వాట్సాప్ సందేశాల గోప్యత విషయంలో వినియోగదారులను తప్పుదారి పట్టించిందని మెటాపై అమెరికాలో పిటిషన్ దాఖలైంది. దీనితో ఎలాన్ మస్క్, టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ విమర్శలు చేశారు.

వాట్సాప్ పైరసీ పిటిషన్లో ప్రధాన ఆరోపణ ఏమిటి?

మెటా వాట్సాప్ సందేశాలు పూర్తిగా ప్రైవేట్ అని, పంపినవారు, స్వీకరించేవారు మాత్రమే చదవగలరని వినియోగదారులను మోసం చేస్తోందని పిటిషన్ ఆరోపిస్తుంది. మెటా వినియోగదారు కమ్యూనికేషన్లోని కొన్ని భాగాలను స్టోర్ చేసి, విశ్లేషిస్తుందని వాదులు పేర్కొన్నారు.

టెక్ లీడర్లు దీనిపై ఎలా స్పందించారు?

పావెల్ దురోవ్ వాట్సాప్ భద్రతపై సందేహాలు వ్యక్తం చేశారు. ఎలాన్ మస్క్ కూడా వాట్సాప్, సిగ్నల్ సురక్షితం కాదని, X చాట్ వాడమని సూచించారు.

మెటా వాట్సాప్ గోప్యతా ఆరోపణలపై ఎలా ప్రతిస్పందించింది?

మెటా ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించింది. పిటిషన్ ను 'పనికిమాలినది'గా పేర్కొంది. వాట్సాప్ దాదాపు పదేళ్లపాటు ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ ను ఉపయోగిస్తోందని, తమకు సందేశాలకు యాక్సెస్ లేదని మెటా హెడ్ విల్ క్యాత్కార్ట్ తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

OTP Tip To Check Call History: పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
పూర్తి కాల్ హిస్టరీ చేయడానికి OTPని ఎలా ఉపయోగించాలి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటలో 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget