Best Foods for Thyroid : థైరాయిడ్ ఉన్నవారు డైట్లో కచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ లిస్ట్.. బెనిఫిట్స్ ఇవే
Thyroid Friendly Foods : థైరాయిడ్ ఉన్నవారు తమ డైట్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ముఖ్యంగా కొన్ని ఫుడ్స్‌ని రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిదని చెప్తున్నారు నిపుణులు. అవేంటంటే..

Foods for Hypothyroidism : థైరాయిడ్ అనేది శరీరంపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. మెటబాలీజంని, ఎనర్జీని తగ్గించేస్తుంది. మానసిక స్థితిని కూడా నియంత్రిస్తుంది. అంతేకాకుండా బరువులో కూడా ఎన్నో మార్పులు తెస్తుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు రెగ్యులర్‌గా మందులు వాడాలని డాక్టర్లు సూచిస్తారు. దానితో పాటు కొన్ని ఫుడ్స్‌ని కూడా డైట్లో చేర్చుకోవాలి. దీనివల్ల థైరాయిడ్ సమస్యను కంట్రోల్ చేసి.. ఇతర సమస్యలను దూరం చేసుకోగలుగుతారు.
హైపోథైరాయిడ్‌తో ఇబ్బందిపడేవారు డైట్ విషయంలో కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారు బ్రకోలీ, క్యాలీఫ్లవర్, సోయా వంటివాటిని తీసుకోకూడదు. ఇది పరిస్థితిని దిగజార్చుతుంది. మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే థైరాయిడ్ సమస్యను కంట్రోల్ చేయవచ్చో ఇప్పుడు చూసేద్దాం.
అయోడిన్ ఫుడ్స్
థైరాయిడ్ సమస్య ఉన్నవారు అయోడిన్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే మంచిది. ఇవి థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమవుతాయి. కాబట్టి మీరు అయోడిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్‌ని తీసుకోవచ్చు. సీవీడ్, అయోడైజ్డ్ సాల్ట్స్, పాల ఉత్పత్తులు, గుడ్లు మంచి అయోడిన్ ఫుడ్స్‌కి మంచి ఆప్షన్. అయితే వీటిని ఎక్కువగా తీసుకుంటే సమస్య ఇంకా తీవ్రమవుతుంది కాబట్టి లిమిటెడ్‌గా తీసుకోవాలి.
సెలీనియం ఫుడ్స్..
సన్‌ఫ్లవర్ సీడ్స్, మష్రూమ్స్, గుడ్లు, ట్యూనా చేపల్లో సెలీనియం ఉంటుంది. థైరాయిడ్‌లో T4, T3 యాక్టివ్ హార్మోన్లను కంట్రోల్ చేయడానికి సెలీనియం ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి. కాబట్టి వీటిని డైట్లో చేర్చుకోవచ్చు. బ్రెజిల్ నట్స్ రోజుకు ఒకటి లేదా రెండు తీసుకోవచ్చు.
జింక్ ఫుడ్స్
థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్‌కి, రోగనిరోధక శక్తిని పెంచడానికి జింక్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. గుమ్మడి గింజలు, పప్పులు, జీడిపప్పు, శనగలు, బీఫ్లలో జింక్ ఉంటుంది. కాబట్టి వీటిని డైట్లో చేర్చుకోవచ్చు.
పండ్లు, కూరగాయలు..
పండ్లలో, కూరగాయల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. థైరాయిడ్ ఉన్నవారికి ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిని కంట్రోల్ చేయడానికి బెర్రీలు, తోటకూర, క్యారెట్లు, బెల్ పెప్పర్స్, ఆకుకూరలు తీసుకోవచ్చు.
ప్రోబయోటిక్ ఫుడ్స్
థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి గట్ హెల్త్ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి మీరు గట్ హెల్త్ కోసం ప్రోబయోటిక్ ఫుడ్స్ తీసుకోవచ్చు. యోగర్ట్, పెరుగు, కిమ్చి వంటి ఫుడ్స్ తీసుకోవచ్చు.
హెల్తీ ఫ్యాట్స్
హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తూ.. ఇన్ఫ్లమేషన్ని తగ్గించుకోవడానికి హెల్తీ ఫ్యాట్స్ తీసుకోవాలి. చెడు కొవ్వులు ఆరోగ్యాన్ని నాశనం చేస్తే మంచి కొవ్వులు హెల్తీగా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. అవకాడోలు, ఆలివ్ నూనె, నట్స్, సీడ్స్, ఫ్యాటీ ఫిష్‌లను హెల్తీ ఫ్యాట్‌గా తీసుకోవచ్చు.
మీ డైట్లో ఈ ఫుడ్స్ తీసుకుంటూ.. రెగ్యులర్‌గా థైరాయిడ్ మందులు తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. లేదంటే మీ లైఫ్‌స్టైల్‌కి తగ్గట్లు నిపుణుల సలహాలు తీసుకుని డైట్ ప్లాన్ చేసుకోవచ్చు.






















