అన్వేషించండి

TDP Trap: మండలిలో మత రాజకీయం- జగన్‌పై క్రిస్టియన్ ముద్ర - టీడీపీ వ్యూహంలో చిక్కుకున్న వైసీపీ ?

TDP trap: శాసనమండలిలో కల్తీ నెయ్యిపై చర్యలో జగన్ మతాన్ని టీడీపీ సభ్యులు ప్రస్తావించిన అంశంలో సరైన విధంగా వైసీపీ ఎమ్మెల్సీలు ఎదుర్కోలేకపోయారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

YSRCP falls into TDP Christian trap:   శాసనమండలిలో జరిగిన పరిణామాల్లో  వైసీపీ చాలా పక్కాగా టీడీపీలో  ట్రాప్ లో పడినట్లుగా కనిపిస్తోంది. కల్తీ నెయ్యి అంశంపై చర్చలో  టీడీపీ సభ్యులు వ్యూహాత్మకంగా జగన్ మతం ప్రస్తావన తెచ్చారు. అచ్చెన్నాయుడు శాసనమండలి చైర్మన్ ను ఇంక్లూడ్ చేస్తూ మీరు..మీ నాయకుడు క్రిస్టియన్లు అని అన్నారు. దాంతో మండలి చైర్మన్ ఉలిక్కి పడ్డారు. తాను హిందువునేనని చెప్పారు. పేరుతో మోషేన్ అని ఉంటే మతం మార్చుకున్నట్లు కాదన్నారు. అయితే జగన్ విషయాన్ని ఎవరూ ప్రస్తావించలేదు. దాంతో అచ్చెన్నాయుడు.. తాను జగన్ క్రిస్టియన్ అనే మాటకు కట్టుబడి ఉంటానని ప్రకటించారు.  

జగన్ మత ప్రస్తావనతో గందరగోళంలో వైసీపీ సభ్యులు                

ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో కల్తీ నెయ్యి అంశంపై జరిగిన చర్చ కేవలం ఆరోపణలకే పరిమితం కాలేదు. అధికార తెలుగుదేశం పార్టీ వేసిన రాజకీయ వ్యూహంలో వైసీపీ సభ్యులు అడ్డంగా బుక్కయ్యారు. తిరుమల పవిత్రత గురించి చర్చ జరుగుతున్న తరుణంలో, మత ప్రస్తావన తీసుకురావడం ద్వారా వైసీపీని డిఫెన్స్‌లో పడేయాలన్న టీడీపీ వ్యూహం పక్కాగా అమలు జరిగింది. సభలో లేని జగన్ మతాన్ని ప్రస్తావిస్తూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందించే క్రమంలో వైసీపీ సభ్యులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.  

క్రిస్టియన్ పార్టీగా ముద్రవేసే ట్రాప్            

తిరుమల లడ్డూ వంటి అత్యంత సున్నితమైన హిం దూ సెంటిమెంట్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు, వైసీపీని ఒక నిర్దిష్ట మతానికి చెందిన పార్టీగా చిత్రించాలనేది టీడీపీ ప్లాన్. అచ్చెన్నాయుడు నేరుగా జగన్ మతాన్ని ప్రస్తావించినా, దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడంలో వైసీపీ సభ్యులు విఫలమయ్యారు. దీనివల్ల ప్రజల్లోకి  వైసీపీ  అధినేత ఒక క్రిస్టియన్ అనే ముద్రను బలంగా తీసుకెళ్లే అవకాశం టీడీపీకి చిక్కినట్లయింది. ఈ మొత్తం ఎపిసోడ్‌లో వైసీపీకి ఒక సీనియర్ దిశానిర్దేశకుడు లేని లోటు స్పష్టంగా కనిపించింది. సాధారణంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ   తన చాకచక్యంతో సభను దారిలోకి తెచ్చేవారు. కానీ ఆయన అనారోగ్యంతో సభకు రాకపోవడంతో, టీడీపీ సభ్యులు వేస్తున్న ప్రశ్నలకు, విమర్శలకు వైసీపీ సభ్యులు తడబడ్డారు.  

వాయిదా పడినా ఇమేజ్ డ్యామేజ్ 

పరిస్థితి విషమిస్తోందని, మతపరమైన చర్చ తమకు నష్టం చేకూరుస్తుందని గ్రహించిన వైసీపీ సభ్యులు ఆందోళన చేపట్టడంతో సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో చైర్మన్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది. లడ్డూ నెయ్యి నాణ్యతపై ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన వైసీపీ, చివరకు తమ మత గుర్తింపును కాపాడుకోవాల్సిన ఆత్మరక్షణ స్థితికి పడిపోయింది.  మండలిలో జరిగిన ఈ పరిణామాలు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారనున్నాయి. కేవలం కల్తీ నెయ్యి చర్చకు మాత్రమే పరిమితం కాకుండా, దీన్ని ఒక మతపరమైన కోణంలోకి మళ్లించడంలో టీడీపీ విజయం సాధించింది. చట్టసభ రికార్డుల్లోనే జగన్  మతం గురించి చర్చ రావడం, దాన్ని కౌంటర్ చేయలేకపోవడం వైసీపీకి రాజకీయంగా ఇబ్బందికరమైన అంశంగానే భావిస్తున్నారు.       

టాప్ హెడ్ లైన్స్

CM Vijay Delimitation Meeting: తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌ను బహిష్కరించిన 37 మంది ఎంపీలు
తమిళనాడు సీఎం విజయ్‌కు బిగ్ షాక్! డీలిమిటేషన్ మీటింగ్‌కు 37 మంది ఎంపీలు డుమ్మా!
Polavaram Banakacherla Project : పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
పోలవరం–బనకచర్ల ప్రాజెక్టు తిరస్కరణ - రేవంత్ విజయమా? చంద్రబాబు వైఫల్యమా?
Ambati Rambabu Padayatra Postponed : వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
వైసీపీలో అంబటి పాదయాత్ర రద్దు కలకలం - నేతల వ్యక్తిగత మైలేజ్ రాజకీయాలను జగన్ అంగీకరించరా?
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget