Thyroid : స్ట్రెస్ ఎక్కువైతే థైరాయిడ్ తప్పదట.. ఒత్తిడితో ఉన్న లింక్ ఇదే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Stress and Thyroid : ఒత్తిడి ఎక్కువైతే మానసికంగానే కాదు శారీరకంగానూ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిలో థైరాయిడ్ కూడా ఒకటి. అసలు దానికి, థైరాయిడ్కి ఉన్న లింక్ ఏంటంటే..

Connection Between Stress and Thyroid : ఒత్తిడి అనేది ఈ మధ్యకాలంలో కామన్ వర్డ్ అయిపోయింది. చిన్న పిల్లలనుంచి పెద్దలవరకు అందరూ ఈ స్ట్రెస్ బారిన పడుతున్నారు. దీనికి ఒక్క రీజన్ అంటూ ఏమి ఉండదు. వివిధ కారణాలు ఒత్తిడిని పెంచి మనశ్శాంతి లేకుండా చేస్తాయి. అయితే ఇది కేవలం మానసిక రుగ్మతలనే ఇస్తుందనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఒత్తిడి వల్ల శారీరక సమస్యలు కూడా పెరుగుతాయి. అలాంటివాటిలో థైరాయిడ్ ఒకటి.
ముప్పు మొదలయ్యేది అక్కడే
దీర్ఘకాలికంగా మీరు ఒత్తిడితో బాధపడుతుంటే థైరాయిడ్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి, అడ్రినల్ గ్రంథులతో కలిసి పని చేస్తుంది. కిడ్నీలపై ఉన్న అడ్రినల్ గ్రంథులు తేలికపాటి ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. కానీ.. ఒత్తిడి ఎక్కువైనప్పుడు శరీరంలోకి కార్టిసాల్ విడుదల అవుతుంది. అసలు ముప్పు అక్కడే మొదలవుతుంది. ఇది శరీర విధులను పెంచి.. అవయవాలకు మరింత ఒత్తిడిని కలిగిస్తుంది.
నో థైరాక్సిన్
ఒత్తిడి ఎక్కువైనప్పుడు అడ్రినల్ గ్రంథుల ద్వారా కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి గణనీయంగా పెరుగుతుంది. ఇది పిట్యూటరీ గ్రంథి నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీనివల్ల థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే ప్రధాన హార్మోన్ అయిన థైరాక్సిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది థైరాయిడ్ సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి ఒత్తిడితో ఇబ్బంది పడేవారు దానిని తగ్గించుకునేందుకు చర్యలు తీసుకోవాలి.
సెన్సిటివిటీ పెరుగుతుంది..
థైరాయిడ్ రావడానికి ఒత్తిడి మాత్రమే కారణం అని కూడా చెప్పలేము. వివిధ రీజన్స్ వల్ల కూడా ఇది వస్తుంది. అయితే థైరాయిడ్‌పై ఒత్తిడి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ఇది మెటబాలీజంను మందగిస్తుంది. దీనివల్ల హైపోథైరాయిడిజం వస్తుంది. అలాగే థైరాయిడ్ కూడా ఒత్తిడిని పెంచుతుంది. హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం వంటి థైరాయిడ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు శారీరక, మానసికంగా సున్నితంగా మారిపోతారు. ఇది కూడా స్ట్రెస్‌కి, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
సరైన ఆధారాలు లేకున్నా..
ఒత్తిడి, థైరాయిడ్ మధ్య లింక్ ఉందని చెప్పే ఆధారాలు లేవు కానీ.. అనేక పరిశోధ అధ్యయనాలు ఇవి ఒకదానిని ఒకటి ప్రభావితం చేసుకుంటున్నట్లు తేల్చాయి. అందుకే ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలని అంటున్నారు. థైరాయిడ్ ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండిటినీ బ్యాలెన్స్ చేసుకుంటే ఆరోగ్యంగా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన అవసరం రాదని చెప్తున్నారు.
ఇవి ట్రై చేయండి..
హైపోథైరాయిడిజం అయినా.. హైపర్ థైరాయిడిజం అయినా.. ఒత్తిడిని తగ్గించుకునేందుకు శరీరానికి తగినంత విటమిన్లు అందిస్తూ ఉండాలి. విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియం, మల్టీ విటమిన్ టాబ్లెట్లను వైద్యుల సూచనల మేరకు తీసుకోవాలి. అలాగే విటమిన్ బి 12 ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. నిద్ర వల్ల ఒత్తిడి తగ్గుతుంది. థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది కాబట్టి రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి.
ఈ మార్పులు, చేర్పులు అవసరం
పండ్లు, కూరగాయలు, చేపలు, గుడ్లు, మిల్లెట్స్ వంటి పోషకాలతో నిండిన ఫుడ్స్ మంచి ప్రయోజనాలు అందిస్తాయి. పోషకాహారం అందించడం వల్ల కూడా ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. థైరాయిడ్‌ను కంట్రోల్ చేసుకోవడానికి అయోడిన్‌ను కూడా చేర్చుకోవచ్చు. ఈ డైట్ ఫాలో అవుతూ వ్యాయామం కూడా రెగ్యులర్‌గా చేయాలి. ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రను మెరుగుపరుస్తుంది. తద్వారా థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. వైద్యులు సూచించిన మందులు కూడా రెగ్యులర్‌గా వేసుకుంటే మంచి ఫలితాలు చూడొచ్చు.
Also Read : బరువును వేగంగా తగ్గించడంలో హెల్ప్ చేసే ఫుడ్స్ ఇవే.. మరెన్నో బెనిఫిట్స్ కూడా
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

