Ruturaj Gaikwad Century in India vs South Africa ODI | అన్నా! నువ్వు సెంచరీ చెయ్యకే ప్లీజ్ | ABP Desam
శివం దుబే ని టీమిండియా lucky charm అంటారు కదా.. అలాగే ఇప్పుడు ఋతురజ్ గైక్వాడ్ ని టీమిండియా iron leg అంటున్నారు కొంతమంది క్రికెట్ ఫ్యాన్స్. సౌత్ ఆఫ్రికాతో 2nd వన్డేలో కోహ్లీతో పాటు సూపర్ సెంచరీ కొట్టి.. టీం స్కోర్ 358 వరకు చేర్చినా.. మ్యాచ్ మాత్రం ఓడిపోయింది ఇండియా. ఇదే అదనుగా ఫ్యాన్స్ గైక్వాడ్ పై trolls స్టార్ట్ చేసారు. మనోడు సెంచరీ కొట్టిన తర్వాత కూడా ఇంకా ఇండియా ఎలా గెలుస్తుంది? అంటూ సేటైర్లు పేలుస్తున్నారు. నిజానికి ఇది గైక్వాడ్ కి కెరీర్లో తొలి వన్డే international century.. టీమిండియా తరపున ఓవరాల్ గా రెండో సెంచరీ. Ipl లో కూడా csk తరపున రుతూరాజ్ ఓ సెంచరీ చేశాడు. అయితే విచిత్రం ఏంటంటే.. మనోడు సెంచరీ కొట్టిన మూడుసార్లు టీం ఓడిపోయింది. బుధవారం సఫారీలపై 83 బంతుల్లో 105 రన్స్ తో సెంచరీ చేశాడు ruturaaj.. కానీ ఇండియా ఓడిపోయింది. వన్డేలో టీమిండియాపై చేజ్ చేసిన టాప్ స్కోర్ ఇదే. అలాగే గతంలో 2023లో గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో గైక్వాడ్ ఏకంగా 123 పరుగులతో అద్భుతమైన సెంచరీ చేశాడు. ఇది international క్రికెట్‌లో మనోడి ఫస్ట్ సెంచరీ. కానీ గ్లెన్ మాక్స్‌వెల్ వీర బాదుడుతో సెంచరీ చేయడంతో ఆస్ట్రేలియా 223 పరుగుల టార్గెట్ ని ఈజీగా చేజ్ చేసేసింది అండ్ ఇండియాని ఒడించేసింది. ఇది T20 హిస్టరీలో టీమిండియాపై చేజ్ చేసిన టాప్ స్కోర్. ఇక ఐపీఎల్‌లోనూ రాజస్థాన్ పై 2021 లో, లక్నోపై 2024లో సెంచరీ లు బాదాడు రుటురాజ్. కానీ విచిత్రంగా ఈ రెండు మ్యాచుల్ల csk దారుణంగా ఓడిపోయింది. Ipl చరిత్రలో ఓ csk బ్యాటర్ సెంచరీ కొట్టి కూడా ఆ టీం ఓడిపోయిన రెండు మ్యాచ్ లు ఇవే. ఇవన్నీ చూపించి ఇప్పుడు గైక్వాడ్ ని ‘అన్నా! నువ్వు సెంచరీ చెయ్యకే ప్లీజ్‘ అంటూ trolling చేస్తున్నారు కొంతమంది. మరి ఈ trolling పై మీ ఒపీనియన్ ఎంటి?





















