Harbhajan Singh about Rohit Sharma Virat Kohli | రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై హర్బజన్ సింగ్ ఇంట్రస్టింగ్ కామెంట్స్
కెరీర్లో ఏం సాధించని వాళ్లు రోహిత్, కోహ్లీ ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తున్నారంటూ టీమిండియా మాజీ క్రికెటర్ హర్బజన్ సింగ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. టీమిండియాలో రోహిత్, కోహ్లీ ప్లేస్‌పై దాదాపు కొన్ని నెలల నుంచి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా జరిగిన ఆసీస్‌తో వన్డే సిరీస్ ముందైతే.. ఇదే రోకోకి లాస్ట్ సిరీస్ అని కూడా ప్రచారం జరిగింది. అంతేకాదు.. ఆ మ్యాచ్ టైంలో ఒకవేళ రోహిత్, కోహ్లీ మూడు మ్యాచుల్లో మూడు సెంచరీలు కొట్టినా కూడా 2027 వరల్డ్ కప్ ఆడతారని గ్యారెంటీ లేదంటూ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చేసిన కామెంట్స్ కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఆ సిరీస్‌లో రోహిత్, కోహ్లీ అద్భుతంగా రాణించడంతో అంతా సైలెంట్ అయిపోయారు. ఇక ఇప్పుడు సఫారీ టీమ్‌తో వన్డే సిరీస్‌లో అయితే కోహ్లీ ఇప్పటికే రెండు వరుస సెంచరీలతో దుమ్ము లేపుతున్నాడు. మరో వైపు రోహిత్ ఓ హాఫ్ సెంచరీతో ఫామ్‌లో ఉన్నాడు. ఇలా కుర్రాళ్లకంటే టాప్ ఫామ్‌లో దూసుకుపోతుండటంతో ఇలాంటి లెజెండరీ ప్లేయర్లని రిటైర్మెంట్ ఇచ్చేయాలనడంపై హెడ్ కోచ్, సెలక్షన్ టీమ్‌పై మళ్లీ విమర్శలు స్టార్ట్ అయ్యాయి. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో హర్బజన్ కూడా.. ‘ఎవరైతే వాళ్ల కెరీర్లో పెద్దగా ఏం సాధించలేదో.. వాళ్లు రోహిత్, కోహ్లీ లాంటి అద్భుతమైన ప్లేయర్ల ఫ్యూచర్‌ని డిసైడ్ చేస్తుండటం దురదృష్ణకరం. నేను ఆడే టైంలో కూడా నాతో పాటు ఎంతోమంది నా తోటి ఆటగాళ్లు ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొన్నారు. రోకో పరుగుల వరద పారిస్తూ సూపర్ ఫామ్‌లో దూసుకుపోతున్నారు. అలాంటి వాళ్లని రిటైర్ కావాలనడం తప్పు. రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకోవాలనేది వాళ్లకి తెలుసు. ఆ నిర్ణయాన్ని వాళ్లకే వదిలేయండి’ అని భజ్జీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.





















