అన్వేషించండి

Minister Ponguleti: ఎల్పీనగర్ సీరీస్ భూముల్ని రియల్ ఎస్టేట్‌కు ఇచ్చింది కేటీఆరే - మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పొంగులేటి సంచలన ఆరోపణలు చేశారు.హిల్ట్ పాల‌సీలో రెండు అంశాలు బిఆర్ఎస్ పాల‌న‌లో వ‌చ్చిన‌వేనన్నారు.

Ponguleti made sensational allegations against KTR:  హిల్ట్ పాల‌సీపై బి.ఆర్. ఎస్ విమ‌ర్శ‌ల‌ను మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తిప్పికొట్టారు. శుక్ర‌వారం స‌చివాల‌యంలో జ‌రిగిన మీడియా స‌మావేశంలో హిల్ట్ పాల‌సీపై బిఆర్ఎస్ ఆరోప‌ణ‌ల‌పై విలేక‌రులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు మంత్రి పొంగులేటి స‌మాధాన‌మిచ్చారు.  హిల్ట్ పాల‌సీలో రెండు అంశాలు బిఆర్ఎస్ పాల‌న‌లో వ‌చ్చిన‌వే, ఆ ఫైల్‌పై మంత్రిగా కేటీఆర్ సంత‌కం చేసిన సంగ‌తి మ‌రిచారా అని ప్రశ్నించారు. గ‌త ప్ర‌భుత్వంలో కోకాపేట‌, నియోపోలిస్ ప్లాట్లు వేలం వేశారు, హిల్ట్‌ను దోపిడీ పాల‌సీ అంటున్న కేటీఆర్‌కు ఇవి గుర్తులేవా అని మండిపడ్డారు.                                       

ఓఆర్ ఆర్ నిర్వ‌హ‌ణ‌ను కూడా వేలం వేశారు. అయ్య ముఖ్య‌మంత్రిగా కొడుకు ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రిగా కావ‌ల‌సిన వారి ద‌గ్గ‌ర ముడుపులు తీసుకొని భూముల‌ను క‌న్వ‌ర్ష‌న్ చేశారని ఆరోపించారు.  ప్ర‌భుత్వ భూములు వేలం వేశారు. ప‌రోక్షంగా, ప్ర‌త్య‌క్షంగా వేలాది ఎక‌రాలు వేలం వేశారు.ఆనాడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఎల్‌బి న‌గ‌ర్‌లోని దాదాపు 40 ఎక‌రాల స్ధ‌లాన్ని పివి రాజు ఫార్మా కంపెనీకి లీజుకు ఇవ్వ‌డం జ‌రిగింది. అక్క‌డ కెమిక‌ల్ ఫ్యాక్ట‌రీ తోటి భూగ‌ర్భ జ‌లాలు క‌లుషితం అవుతున్నాయ‌ని అక్క‌డి ప్ర‌జ‌లు ఆందోళ‌న కూడా చేశారు. ఈ కెమిక‌ల్ ఇండ‌స్ట్రీని రెసిడెన్షియ‌ల్ జోన్‌గా మార్చింది బిఆర్ఎస్  పార్టీనేనన్నారు. ఈ ఫైలుపై అయ్య కొడుకులు సంత‌కాలు చేశారని పొంగులేటి అన్నారు.  ఏ పాల‌సీతో ఈ క‌న్వ‌ర్ష‌న్ చేశారు. ఐడిపిఎల్ లో కూడా ఇదే విధంగా చేశారు. కేటీఆర్ క‌డుపునిండా విష‌మేఉంది. విషం క‌క్క‌డానికి కూడా ఒక హ‌ద్దు, అదుపు, ప‌ద్ద‌తి ఉంటుంది. కేటీఆర్ ది క‌డుపుమంట‌. విష‌పూరిత‌మైన ఆలోచ‌న.  హిల్ట్ పాల‌సీపై బిజేపీ , బిఆర్ఎస్‌ది ఒకే డ్రామా. స్క్రిప్ట్ రాసేది ఒక‌రు. డెలివ‌రీ చేసేది మ‌రొక‌రు అని మండిపడ్డారు.  

హిల్ట్ పాలసీపై కేటీఆర్ చేస్తున్న ఆరోపణలు ఇవే  

 తెలంగాణ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీ (HILTP)ను  భారత చరిత్రలో అతిపెద్ద ల్యాండ్ స్కామ్ గా ఆరోపిస్తున్నారు  ఈ పాలసీ ద్వారా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ నేతలు రూ. 5 లక్షల కోట్ల స్కాం చేస్తున్నారని అంటున్నారు.  హైదరాబాద్ చుట్టూ ఉన్న ఇండస్ట్రియల్ క్లస్టర్లలో  ఉన్న 9,292 ఎకరాల ప్రైమ్ ఇండస్ట్రియల్ ల్యాండ్‌ను రెగ్యులరైజ్ చేసి,  కమర్షియల్, రెసిడెన్షియల్ గా మార్చడానికి అవకాశం ఇస్తుంది.  ఈ 9,292 ఎకరాలు ఓపెన్ మార్కెట్ విలువ రూ. 40-50 కోట్లు/ఎకరం. మొత్తం విలువ రూ. 4-5 లక్షల కోట్లు. కానీ పాలసీ ప్రకారం, కన్వర్షన్ కోసం సబ్-రిజిస్ట్రార్ ఆఫీస్ (SRO) విలువలో కేవలం 30% మాత్రమే చెల్లించాలి. SRO రేట్లు ఆసలు మార్కెట్‌కు 4-5 రెట్లు తక్కువని, ఇది 'పబ్లిక్ మనీని ప్రైవేట్ పాకెట్లకు బహుమతిగా ఇవ్వడం' అని ఆరోపిస్తున్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Advertisement

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget