అన్వేషించండి

Tegalu Health Benefits : తేగలతో అద్భుత ప్రయోజనాలు.. డిటాక్స్ నుంచి వెయిట్ లాస్ వరకు ఆరోగ్య లాభాలు ఇవే

Palmyra Sprouts : తేగలు బయట ఎక్కడైనా కనిపిస్తే.. కొనుక్కుని కచ్చితంగా తినాలని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే వీటితో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. అవేంటంటే.. 

Tegalu (Palmyra Sprouts) Benefits for Health : తేగలు గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ వాటి ఆరోగ్య ప్రయోజనాలు తెలియడం వల్ల వాటికి పట్టణాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. తాటి మొలకలనే తేగలు అంటారు. నిజానికి వీటిని సూపర్ ఫుడ్ అంటారు. ఎందుకంటే శరీరంలోని వేడిని తగ్గించి.. కడుపునకు కంఫర్ట్ ఫుడ్​గా, ఎనర్జీని ఇచ్చే ఫుడ్​గా చెప్తారు. ఆరోగ్యానికి మేలు చేసే ఈ తేగలు గురించి ఎక్కువమందికి తెలియదు. కానీ.. వీటితో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు. 

తేగలు అంటే.. 

తాటి మొలకలనే తేగలు అంటారు. తాటి చెట్టు కాయలను తాటికాయలు అంటారు. అయితే తాటికాయల దశకు ముందు తాటి ముంజలు ఉంటాయి. వీటిని సమ్మర్​లో ఎక్కువగా తింటారు. ఆ తాటి ముంజలు ముదిరితే తాటికాయలు అవుతాయి. వీటిని కొందరు ఇష్టంగా తింటారు. వీటిని కాల్చుకుని లేదా ఇతర వంటకాలు చేసుకుని ఆస్వాదిస్తారు. 

తాటికాయల సమయంలో గుజ్జుతో పాటు లోపల టెంక ఉంటుంది. వీటిని భూమిలో నాటితే వచ్చేవి తేగలు. అయితే తేగల కంటే ముందు తాటి గుంజు (బుర్రగుంజు) కూడా ఫేమస్ ఫుడ్​గానే చెప్పవచ్చు. కానీ ఇది ఎక్కువమందికి తెలియకపోవచ్చు. ఆ తాటి గుంజు తీయకుండా.. మట్టి కప్పి ఉంచితే.. మొలకల దశలో తేగలు సిద్ధమవుతాయి. వీటిని కాల్చి లేదా ఉడికించి.. అమ్ముతూ ఉంటారు.

తేగలతో వచ్చే హెల్త్ బెనిఫిట్స్.. 

శరీరంలో వేడి చేస్తే వచ్చే సమస్యలను దూరం చేయడంలో తేగలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. శరీరంలో హీట్​ని తగ్గించి బాడీని కూల్ చేస్తాయి. అలాగే వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. మలబద్ధం తగ్గుతుంది. గ్యాస్, ఎసిడిటీ, బ్లోటింగ్ సమస్యలు తగ్గుతాయి. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల పేగులు ఫ్రెష్‌గా పనిచేస్తాయి.

అంతేకాకుండా తేగలు బాడీని డిటాక్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. రక్తాన్ని శుభ్రపరుస్తాయి. చర్మంపై వచ్చే మొటిమలు, ర్యాష్​ని తగ్గిస్తాయి. తేగలలో కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, B-కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి బలాన్ని పెంచుతాయి. ఎముకలు, కండరాలు బలంగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. దీనిలోని అధిక ఫైబర్, లో కేలరీలు కడుపు నిండిన అనుభూతి ఇచ్చి.. బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. కాబట్టి హెల్తీ స్నాక్​గా తీసుకోవచ్చు. ఇది రక్తంలోని చక్కెర లెవెల్స్ తగ్గించి.. మధుమేహాన్ని కంట్రోల్ చేస్తుంది. 

డైట్లో ఎలా తీసుకోవచ్చంటే.. 

చాలామంది తేగలను కాల్చి తీసుకుంటారు. కానీ వీటిని చాలా రకాలుగా తీసుకోవచ్చు. ఉప్పు వేసి ఉడికించి తీసుకోవచ్చు. సాంబార్​లో, కూరల్లో, కొబ్బరితో కలిపి ఉడికించి కూడా తీసుకోవచ్చు. అయితే దీనిని తీసుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బాగా ఉడికించిన తర్వాతే తినాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు తక్కువగా తినాలి. 

తేగలను ప్రకృతి ఇచ్చిన ఆరోగ్య బహుమతిగా స్వీకరిస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి. అందుకే ఖరీదైన సప్లిమెంట్స్ కంటే ఇవి వందరెట్లు మంచివి అంటారు. మరి మీరు కూడా మీ డైట్లో తేగలను యాడ్ చేసేసుకోండి. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

PM Modi: సోమనాథ్‌లో శౌర్య యాత్రలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రత్యేక ఆకర్షణగా కాన్వాయ్ వెంట 108 గుర్రాలు
సోమనాథ్‌లో శౌర్య యాత్రలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రత్యేక ఆకర్షణగా కాన్వాయ్ వెంట 108 గుర్రాలు
Hyderabad Vijayawada Highway: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
Puri Sethupathi Movie Story : పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్టోరీ అదేనా! - టైటిల్‌ టీజర్ ఎప్పుడు?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్టోరీ అదేనా! - టైటిల్‌ టీజర్ ఎప్పుడు?
IND vs NZ 1st ODI: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ లెవన్ ఇదే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ లెవన్ ఇదే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే
Advertisement

వీడియోలు

MI vs DC WPL 2026 Highlights | ముంబై ఘన విజయం
Vaibhav Suryavanshi India vs Scotland U19 | వార్మప్ మ్యాచ్‌లో అదరొట్టిన వైభవ్!
India vs New Zealand 1st ODI Preview | నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే
Virat Kohli Records Ind vs NZ | కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు!
Gollapudi Gannavaram Bypass Beauty | కొండల మధ్య నుంచి ఇంత చక్కని బైపాస్ రోడ్ చూశారా.! | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: సోమనాథ్‌లో శౌర్య యాత్రలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రత్యేక ఆకర్షణగా కాన్వాయ్ వెంట 108 గుర్రాలు
సోమనాథ్‌లో శౌర్య యాత్రలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ప్రత్యేక ఆకర్షణగా కాన్వాయ్ వెంట 108 గుర్రాలు
Hyderabad Vijayawada Highway: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
Puri Sethupathi Movie Story : పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్టోరీ అదేనా! - టైటిల్‌ టీజర్ ఎప్పుడు?
పూరీ జగన్నాథ్, విజయ్ సేతుపతి మూవీ స్టోరీ అదేనా! - టైటిల్‌ టీజర్ ఎప్పుడు?
IND vs NZ 1st ODI: న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ లెవన్ ఇదే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే
న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. టీమిండియా ప్లేయింగ్ లెవన్ ఇదే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలంటే
Bangladesh Air Force: బంగ్లాదేశ్ ఫైటర్ జెట్స్‌ను పాకిస్తాన్ నుంచే ఎందుకు కొంటోంది? చైనా, అమెరికాలతో ప్రాబ్లం ఏంటి
బంగ్లాదేశ్ ఫైటర్ జెట్స్‌ను పాకిస్తాన్ నుంచే ఎందుకు కొంటోంది? చైనా, అమెరికాలతో ప్రాబ్లం ఏంటి
Yuvraj Singh Batting Tips: కొత్త పాత్రలో యువరాజ్, T20 ప్రపంచ కప్ కు ముందు సంజు శాంసన్‌కు టిప్స్.. వీడియో వైరల్
కొత్త పాత్రలో యువరాజ్, T20 ప్రపంచ కప్ కు ముందు సంజు శాంసన్‌కు టిప్స్.. వీడియో వైరల్
PM Vishwakarma Yojana: ప్రభుత్వ పథకంలో రుణ అవకాశం, 3 లక్షల రూపాయల వరకు సహాయం లభించవచ్చు.
ప్రభుత్వ పథకంలో రుణ అవకాశం, 3 లక్షల రూపాయల వరకు సహాయం లభించవచ్చు.
The Raja Saab Box Office Collection Day 2 : 'ది రాజా సాబ్' రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే? - ఫస్ట్ డేతో పోలిస్తే రెండో రోజు...
'ది రాజా సాబ్' రెండు రోజుల కలెక్షన్స్ ఎంతంటే? - ఫస్ట్ డేతో పోలిస్తే రెండో రోజు...
Embed widget