దోమల బెడద ఎక్కువగా ఉందా? ఇలా తగ్గించుకోండి

దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అయితే వాటి బెడద తగ్గించుకోవచ్చు.

ఇంటి ఆవరణలో, కుండీల్లో నిల్వ నీరు ఉంటే వాటిని తీసేయండి. లేదంటే దోమలు పెరిగి జ్వరాలు రావొచ్చు.

దోమలు రాకుండా నెట్స్, స్క్రీన్స్ ఉపయోగిస్తే వాటి బెడద తగ్గుతుంది. లోపలికి రాకుండా ఉంటాయి.

ఇంటిలో, ఇంటి చుట్టు పక్కలా చెత్త లేకుండా చూసుకోండి. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి.

కాయిల్స్, ఎలక్ట్రిక్ వాపోరైజర్స్ లేదా సహజంగా దోమలన దూరం చేసే కర్పూరం వంటివి వాడొచ్చు.

కొబ్బరి నూనె, వేప నూనె కలిపి స్కిన్​కి అప్లై చేసుకుంటే దోమల బెడద ఉండదు.

తులసి మొక్కలను ఇంటి గుమ్మం దగ్గర కిటికీల దగ్గర పెడితో దోమలు రావు.

కర్పూరాన్ని వెలిగించి ఆ గదిలో పెడితే దోమలు దూరంగా వెళ్లిపోతాయి.

లావెండర్, యూకలిప్టస్, పిప్పర్​మెంట్ ఆయిల్స్ స్పే చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి.