అన్వేషించండి

Dutch mayor search for birth mother in Nagpur: ఇది కలియుగ కుంతీకర్ణుల కథే - తల్లి కోసం నాగ్‌పూర్‌లో డచ్ మేయర్ వెదుకులాట!

Dutch mayor: ఆయన నెదర్లాండ్స్‌లో ఓ నగరానికి మేయర్. కానీ నాగపూర్ లో పుట్టాడు. మూడు రోజులకే తల్లి రోడ్డున పడేసింది. కానీ అతన్ని డచ్ జంట దత్తత తీసుకుంది. ఇప్పుడు జన్మనిచ్చిన తల్లి కోసం నాగపూర్ వచ్చారు.

Dutch mayor steps up search for his birth mother in Nagpur:  నాగ్‌పూర్ వీధుల్లో 41 ఏళ్ల క్రితం మూడు రోజుల పసికందుగా  అనాథగా వదిలి పెట్టేసిన ఒక బాలుడు, నేడు నెదర్లాండ్స్‌లో ఒక నగరానికి మేయర్ స్థాయికి ఎదిగారు. తన పుట్టుక గురించి తెలుసుకుని  తనను కన్నతల్లి కోసం వెతుక్కుంటూ మళ్ళీ మాతృభూమికి  వచ్చారు.  కలియుగ కుంతీకర్ణుల కథను తలపించేలా ఉన్న ఈ ఘటన  హాట్ టాపిక్ గా మారింది.  విధి విచిత్రం ఏమిటంటే, ఆ కర్ణుడికి అర్జునుడి నామమైన ఫల్గుణ్ అనే పేరు లాంటిదే ఈ మేయర్ కూడా ఉంది ఆయన పేరు   ఫల్కో బ్రియెర్. లోకం మారినా, కాలం గడిచినా కన్నతల్లి ప్రేమ కోసం పరితపించే కర్ణుల హృదయం ఎంత గొప్పదో ఈ ఉదంతం మరోసారి చాటిచెబుతోంది.

1984లో నాగ్‌పూర్‌లోని మాతృసేవా సంఘ్ ప్రాంగణంలో ఒక అవివాహిత కుంతి తన పరువు కోసం మూడు రోజుల పసికందును వదిలి వెళ్ళిపోయింది. ఆ అభాగ్యుడిని డచ్ దంపతులు దత్తత తీసుకుని నెదర్లాండ్స్ తీసుకువెళ్లి అల్లారుముద్దుగా పెంచారు. అక్కడ ఆయన పట్టుదలతో చదివి, ప్రస్తుతం  హీమ్‌స్టెడ్ (Heemstede) నగరానికి మేయర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంగరాజ్యానికి కర్ణుడు రాజైనట్లుగా, పరాయి దేశంలో మేయర్ పదవిని చేపట్టినా, తన మూలాలు ఉన్న మట్టిని, కన్నతల్లిని ఆయన మర్చిపోలేదు.                        

తనను కని వదిలేసిన తల్లిపై ఎలాంటి కోపం లేకపోగా, ఆమెను ఒక్కసారైనా చూడాలనే తపనతో ఫల్గుణ్ నాగ్‌పూర్ చేరుకున్నారు. అప్పట్లో తనను చేరదీసిన మాతృసేవా సంఘ్‌ను సందర్శించి, తన తల్లి ఎవరో తెలుసుకునేందుకు సాక్ష్యాధారాల కోసం అన్వేషిస్తున్నారు.  నన్ను వదిలేయడానికి ఆమెకు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో నేను అర్థం చేసుకోగలను, కానీ ఆమెను ఒక్కసారి కలిసి నేను బాగున్నానని చెప్పాలనుంది  అని ఆయన అంటున్న మాటలు వింటుంటే, కర్ణుడి గొప్పతనం ఏ యుగంలోనైనా వెలకట్టలేనిదని అర్థమవుతుంది.

నిజంగా ఇది అద్భుతమైన కథ. అన్యాయం చేసిన తల్లిని కూడా నిందించకుండా, ఆమె క్షేమం కోరుతూ వెతుకుతున్న ఈ  డచ్ మేయర్  రూపంలోని కర్ణుడు మానవత్వానికి నిలువుటద్దం. కన్నప్రేమకు దూరమైనా, కన్నతల్లి గౌరవాన్ని కాపాడే ఈ గుణం చూస్తుంటే, కర్ణుల గొప్పతనం ఎప్పుడూ చరిత్రలో అజరామరంగానే ఉంటుంది.                                                

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
Telangana municipal elections 2026: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
DA Hike Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హోలీ నాటికి డీఏ పెంపు!  
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హోలీ నాటికి డీఏ పెంపు!  
లగ్జరీ కార్ల భారీ ధర వెనుక అసలు కారణాలు ఇవే - ఇలాంటి విషయాల కోసమే డబ్బు ఖర్చు పెట్టేది
లగ్జరీ కార్లు ఎందుకు అంత ఖరీదెక్కువ? నిజంగా దేని కోసం మనం అంత డబ్బు ఖర్చు పెడతాం?
Advertisement

వీడియోలు

T20 World Cup 2026 Jasprit Bumrah, Abhishek Sharma Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
T20 World Cup 2026 Jasprit Bumrah Health Update | కోలుకుంటున్న బుమ్రా, అభిషేక్ శర్మ
Pakistan Conditions to Play with India | భారత్‌తో మ్యాచ్ ..షరతులు పెట్టిన పాక్
Nepal vs England T20 World Cup | ఇంగ్లాండ్‌కు చుక్కలు చూపించిన నేపాల్
Sourav Ganguly slams Pakistan | పాకిస్తాన్ పై సౌరబ్ గంగూలీ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Ambati Rambabu: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్; కానీ ఇప్పుడే విడుదల కష్టమే!అసలు చిక్కు ఎక్కడంటే?
Telangana municipal elections 2026: బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి - ప్రజలు ఆలోచించి ఓట్లు వేయాలి - సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
DA Hike Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హోలీ నాటికి డీఏ పెంపు!  
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! హోలీ నాటికి డీఏ పెంపు!  
లగ్జరీ కార్ల భారీ ధర వెనుక అసలు కారణాలు ఇవే - ఇలాంటి విషయాల కోసమే డబ్బు ఖర్చు పెట్టేది
లగ్జరీ కార్లు ఎందుకు అంత ఖరీదెక్కువ? నిజంగా దేని కోసం మనం అంత డబ్బు ఖర్చు పెడతాం?
Allu Cinemas Dolby Screen : హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ డాల్బీ స్క్రీన్ అల్లు సినిమాస్ - బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2'తో గ్రాండ్ ఓపెనింగ్?
హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ డాల్బీ స్క్రీన్ అల్లు సినిమాస్ - బాలీవుడ్ మూవీ 'ధురంధర్ 2'తో గ్రాండ్ ఓపెనింగ్?
Punjab Crime News: క్లాస్ రూంలోనే అమ్మాయిని కాల్చి చంపి, ఆపై తాను కాల్చుకుని యువకుడు ఆత్మహత్య.. పంజాబ్ లా కాలేజీలో దారుణం
క్లాస్ రూంలోనే అమ్మాయిని కాల్చి చంపి, ఆపై తాను కాల్చుకుని యువకుడు ఆత్మహత్య.. పంజాబ్ లా కాలేజీలో దారుణం
Telangana Municipal Elections 2026: కేటీఆర్ తీరుతో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి నష్టం.. సీఎం కూడా లైట్ తీసుకున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
కేటీఆర్ తీరుతో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకి నష్టం.. సీఎం కూడా లైట్ తీసుకున్నారు: కాంగ్రెస్ ఎమ్మెల్సీలు
India US Trade Deal: అమెరికాతో $500 బిలియన్ల వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్‌కు భారత్‌ ఏమిచ్చింది?
అమెరికాతో $500 బిలియన్ల వాణిజ్య ఒప్పందం కోసం ట్రంప్‌కు భారత్‌ ఏమిచ్చింది?
Embed widget